ప్రస్తుతం టాప్ రేంజ్ లో స్టార్ హీరోలతో జోడి కడుతున్న రష్మికని లక్కీ గర్ల్ అంటున్నారు. నిన్నగాక మొన్న మహేష్ సరిలేరు నీకెవ్వరుతో హిట్ కొట్టిన రష్మిక ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలోకి ఎంటర్ అవబోతుంది. వరసగా పెద్ద హీరోలే తగులుతున్న రశ్మికకి ఇప్పుడు తారక్ కూడా ఛాన్స్ ఇవ్వబోతున్నాడంటున్నారు. గ్లామర్ లేకపోయినా నటనతోనే స్టార్ హీరోలను చుట్టేస్తున్న రష్మిక ఇప్పుడు గ్లామర్ గర్ల్ గా తానేంటో చూపించాలని అనుకుంటుంది. ఇప్పటివరకు రష్మిక గ్లామర్ మీదొస్తున్న వార్తలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయినట్లుగా కనబడుతుంది రష్మిక వ్యవహారం. అందుకే రష్మిక ఇప్పుడు గ్లామర్ డాల్ గా మారిపోయింది.
అది కూడా నితిన్ భీష్మ సినిమాలో రష్మిక గ్లామర్ డోస్ పెంచినట్లుగా... సాంగ్ పోస్టర్స్ చూస్తే అర్ధమవుతుంది. నిన్నటికినిన్న చిన్న ఫ్రాక్ తో నితిన్ ని అల్లుకుపోయి.. తన గ్లామర్ ని కొద్దిగా పరిచయం చేసిన రష్మిక .. నేడు వదిలిన పోస్టర్ లో నితిన్ తో కలిసి శారీతో నడుము ఒంపులను చూపిస్తుంది. అలాగే భీష్మ సాంగ్ పోస్టర్స్ లో నితిన్ కి రష్మిక కి మధ్యన రొమాంటిక్ యాంగిల్ మాత్రం అదిరిపోతుందనే సంగతి ఈ పోస్టర్స్ చూస్తుంటే కలుగుతుంది. నితిన్ - రష్మిక కెమిస్ట్రీ అంతగా ఆ పోస్టర్స్ లో రివీల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు రష్మిక స్టార్ క్రేజ్ ని వాడుకోవాలని ఇలాంటి రొమాంటిక్ పోస్టర్స్ ప్లాన్ చేసి వదులుతుంది భీష్మ టీం అనిపిస్తుంది. రష్మిక క్రేజ్ తో భీష్మ సినిమాపై అందరిలో హైప్ క్రియేట్ అర్ధమవుతుంది. మరి సాంగ్ పోస్టర్స్ లోనే అంతగా గ్లామర్ తో రెచ్చగొడుతున్న రష్మిక సాంగ్స్ లోను, సినిమాలోనూ మరింత హాట్ యాంగిల్ ఏమన్నా చూపిస్తుందా అనేది సస్పెన్స్ గానే ఉంది.