కొంతమంది హీరోయిన్లు చేసినవి కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకుల మీద చెరగని ముద్ర వేస్తుంటారు. ఆ ఒక్క సినిమాతోనే వారికి అభిమానులు తయారవుతుంటారు. ఈ మధ్య కాలంలో తెలుగులో చేసిన ఒక్క సినిమాతోనే అభిమాన గణాన్ని సంపాదించుకున్న హీరోయిన్ ప్రియాంకా ఆరుళ్ మోహన్. నాని హీరోగా చేసిన గ్యాంగ్ లీడర్ సినిమాలో ఈ భామ హీరోయిన్ గా కనిపించింది.
అందమైన మొహంతో, అమాయకమైన కళ్ళతో, చూడడానికి పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఈమెను చూసి చాలా మంది కుర్రాళ్ళు మనసు పారేసుకున్నారు. గ్యాంగ్ లీడర్ తర్వాత ప్రియాంక తెలుగులో శర్వానంద్ సరసన "శ్రీకారం" అనే సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. అదే గాక "మయన్" అనే టైటిల్ తో తెరకెక్కుతున్న మరో తమిళ చిత్రంలో నటిస్తుంది.
మయన్ చిత్రం నుండి ప్రియాంక లుక్ ని రివీల్ చేసింది చిత్ర బృందం. ఈ ఫోటోలని ప్రియాంకా తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. అయితే ఆ ఫోటోలని చూసిన అభిమానులు షాక్ కి గురవుతున్నారు. చాలా సాదాసీదా అమ్మాయిగా అందంగా కనిపించిన ప్రియాంక ఈ ఫోటోల్లో భయంకరంగా ఉంది. మొహం నిండా మేకప్ తో జేజమ్మని తలపించేటట్టుగా ఉండడంతో అభిమానులు చూడలేకపోతున్నారు.
దయచేసి ఇలాంటి ఫోటోలు పెట్టి తమ మనసు పాడు చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఫోటోలోనే ఇలా ఉంటే సినిమాలో ఎలా ఉంటుందో మరి.