Advertisementt

జక్కన్నకు శ్రియ రెక్వెస్ట్.. బంపరాఫర్ నిజమేనా!?

Thu 30th Jan 2020 12:51 PM
shriya saran,ajay devgn,rrr,rajamouli,jr ntr,ram charan  జక్కన్నకు శ్రియ రెక్వెస్ట్.. బంపరాఫర్ నిజమేనా!?
Shriya Saran paired opposite Ajay Devgn in RRR? జక్కన్నకు శ్రియ రెక్వెస్ట్.. బంపరాఫర్ నిజమేనా!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో అప్పుడెప్పుడో తన అందచందాలతో ఓ ఊపు ఊపి అడ్రస్ లేకుండా పోయిన శ్రియ.. మళ్లీ తెలుగులో త్వరలో దర్శనివ్వబోతోందట. అది కూడా ఓటమెరుగని దర్శకధీరుడిగా పేరుగాంచిన రాజమౌళి అలియాస్ జక్కన్న చిత్రంతో అట. టాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈమె చివరిసారిగా 2017లో నందమూరి బాలయ్య హీరోగా నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంలో నటించి ఆ తర్వాత పెళ్లి చేసుకుని విదేశాలకు చెక్కేసింది. పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకుని మిన్నకుండిపోయింది.

అయితే.. తనకు ‘ఛత్రపతి’ సినిమాలో హీరోయిన్‌గా అవకాశమిచ్చి తనకంటూ ఓ గుర్తింపు ఇచ్చాడు రాజమౌళి. అయితే ఆ తర్వాత జక్కన్న తన సినిమాల్లో ఈ అందాల భామకు అవకాశాలివ్వలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చిన్న పాత్ర అయినా సరే చేయడానికి తాను చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నానని.. పాత్ర ఇస్తారని ఆశిస్తున్నట్లు జక్కన్నకు ఈ ముదురు భామ రిక్వెస్ట్ చేసిందట. అంతేకాదు.. బాలీవుడ్‌ హీరో అజయ్ సరసన ‘దృశ్యం’లో నటించడంతో ఆయనతో ఉన్న చనువుతో ఫోన్ చేసి మాట్లాడి తనకు అవకాశం ఇవ్వాలని జక్కన్నను కోరమన్నారట.

దీంతో రెకమెండేషన్ రావడం.. పైగా తన పాత హీరోయిన్ కావడంతో కాదనలేక జక్కన్న.. ‘ఆర్ఆర్ఆర్’లో నటించే బంపరాఫర్ ఇచ్చారని తెలుస్తోంది. అంటే ఇదే నిజమైతే మాత్రం రాజమౌళి సినిమాలో శ్రియ రెండో సినిమా. కాగా.. ఈ మూవీలో అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన షూటింగ్‌ సెట్‌కు వెళ్లారు. వికారాబాద్‌ అడవుల్లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. అజయ్‌కు భార్యగా శ్రియ నటించనుందట. అంటే.. రామ్ చరణ్‌కు అలియాభట్, ఎన్టీఆర్‌కు ఒలీవియో మోరిస్ కాగా.. అజయ్‌కు శ్రియ అన్న మాట. మరి ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి  చూడాల్సిందే.

Shriya Saran paired opposite Ajay Devgn in RRR?:

Shriya Saran paired opposite Ajay Devgn in RRR?  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ