Advertisementt

RRR నుంచి ఒక్క ముక్క కూడా బయటకి రాదట!

Wed 29th Jan 2020 11:49 AM
rrr,ntr,ramcharn,rajamouli  RRR నుంచి ఒక్క ముక్క కూడా బయటకి రాదట!
Not a single piece would come out from RRR sets RRR నుంచి ఒక్క ముక్క కూడా బయటకి రాదట!
Advertisement
Ads by CJ

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. బాహుబలి సినిమా వచ్చి రెండు సంవత్సరాలు దాటినా, ఇప్పటివరకు అంతటి స్థాయి చిత్రం రాలేదు. అయితే ఆర్ ఆర్ ఆర్ బాహుబలిని మించే స్థాయిలో ఉంటుందనే అనుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇప్పటికే డెభ్బై ఐదుశాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుండి లీకేజీలు ఎక్కువవుతున్నాయి.

 

 మొన్నటికి మొన్న ఎన్టీఆర్ లుక్ బయటకి వచ్చింది. ఆ లుక్ ఇంకా వైరల్ అవకుండానే ఆన్ లైన్లోంచి తీయించేశారు. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ పులితో ఫైట్ చేసే విజువల్స్ కూడా వచ్చాయి. దీంతో చిత్ర బృందం టెన్షన్ కి గురైంది. ఒక్కసారిగ సెక్యూరిటీని మరింత టైట్ చేశారు.పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ముఖ్యంగా ఎడిటింగ్ టేబుల్ దగ్గర మరింత సెక్యూరిటీ పెంచారట. అటు షూటింగ్ టైమ్ లోనూ చాలా జాగ్రత్తగా ఉంటున్నాడట. 

 

సెట్లో ముఖ్య తారలతో పాటు సాంకేతిక నిపుణులు కూడా మొబైల్ తీసుకురావడానికి వీల్లేదని కండిషన్ పెట్టాడట. రాజమౌళి సినిమా విషయంలో లీకేజీలు కొత్తేమీ కాదు. మగధీర నుండి మొదలుకుని బాహుబలి వరకు ప్రతీ సినిమాకి సంబంధించి లీకులు జరుగుతూనే ఉన్నాయి. సెక్యూరిటీ టైట్ చేసిన తర్వాతనైనా పరిస్థి బాగుపడుతుందేమొ చూడాలి. ఆర్ ఆర్ ఆర్ చిత్రం అక్టోబర్ లో విడుదల అవుతుందని అంటున్నారు.

Not a single piece would come out from RRR sets :

Rajamouli tightened security for stopping the leakages from RRR. To stop it he uses all his sterngths

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ