నిన్నమొన్నటివరకు మహేష్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మా సినిమా గొప్ప అంటే, మా సినిమా గొప్ప అంటూ సోషల్ మీడియాలో అతి చేసారు. సినిమా విడుదలకు ముందు, విడుదలయ్యాక కూడా మా సినిమా హిట్ అంటే మా సినిమా హిట్ అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయి పాలాభిషేకాలు, కటౌట్స్ వేసుకుని ఆనందించారు. ఇక ఫ్యాన్స్ మధ్యన ఇంత వార్ జరుగుతున్నప్పటికీ.... హీరోల మధ్యన కోల్డ్ వార్ నడిచింది. విడుదల తేదీల విషయంలో వాళ్ల కోల్డ్ వార్ బయటపడింది. ఇక ఫ్యాన్స్ వార్, హీరోల కోల్డ్ వార్ పక్కనబెడితే తాజాగా రెండు సినిమాల కలెక్షన్స్ వార్ ఊపందుకుంది. రెండు సినిమాల నిర్మాతలు మా సినిమా ఇండస్ట్రీ హిట్ అంటే మా సినిమా ఇండస్ట్రీ హిట్ అంటున్నారు.
అనడమేనా రోజుకో సినిమా పోస్టర్ ఇండస్ట్రీ హిట్ అంటూ సోషల్ మీడియాలో వదలడం సక్సెస్ మీట్ పెట్టడం వంటివి చూస్తూనే ఉన్నాం. సరిలేరు మాస్ అయినప్పటికీ.. ఆ సినిమా రెండు వారాలకే కలెక్షన్స్ డ్రాప్ అవడం, అల వైకుంఠపురములో ఫ్యామిలీ హిట్ కావడం ఇప్పటికీ కలెక్షన్స్ పరంగా ఆసక్తి రేకిత్తించడంతో.. బాహుబలి తర్వాత మా చిత్రమే అంటూ, ఇండస్ట్రీ హిట్ అంటూ అల్లు అర్జున్ సహా నిర్మాతలంతా సక్సెస్ మీట్ పెట్టారు. కలెక్షన్స్ గురించి మాట్లాడారు. ఇక అల కలెక్షన్స్ గురించి అయ్యిందో లేదో.. ఇలా సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం ‘అల..’కు ఏ మాత్రం తీసిపోకుండా కోట్లలో షేర్, ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అంటూ పోస్టర్ వదలడం పెద్ద దుమారాన్నే లేపింది.
ఇప్పుడు ఫాన్స్ వార్ కాస్త.. డైరెక్ట్‌గా హీరోల మధ్య చిచ్చు పెట్టింది. అసలు అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ అంటూ పోస్టర్ విడుదల చేస్తే.. సరిలేరు నీకెవ్వరు నిర్మాతలు అయితే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఏకంగా ప్రోమోనే విడుదల చేసారు. మరి ఇదంతా చూస్తే అసలు ఫిగర్లు బయటికి రానివ్వకుండా వారు నిజం చెబుతున్నారో తెలియక ఇప్పుడు సాధారణ ప్రేక్షకుడు కూడా ఈ కలెక్షన్స్ విషయంలో నవ్వుకునే పరిస్థితి వచ్చింది.