బాలకృష్ణ - బోయపాటి కలయికలో తెరకెక్కాల్సిన సినిమా గత ఏడాది ఫిబ్రవరిలోనే మొదలు కావాల్సింది. కానీ మధ్యలో ఎన్టీఆర్ బయోపిక్ దెబ్బ, ఎన్నికల్లో గందరగోళంతో బాలకృష్ణ బోయపాటిని పక్కనబెట్టి.. కె ఎస్ రవికుమార్‌తో రూలర్ అంటూ డిజాస్టర్ సినిమా చేసాడు. ఇక బోయపాటితో బాలకృష్ణ సినిమా జనవరి నుండి సెట్స్ మీదికెళుతుందనుకుంటే... మొదట్లో అంటే రూలర్ దెబ్బకి బోయపాటి సినిమా నిర్మాతకు టెన్షన్ పట్టుకుంది. ఎలాగో ఆ నిర్మాతని సెట్ చేసుకునే సరికి బోయపాటి మదర్ కన్నుమూయడంతో.. బాలయ్య - బోయపాటి సినిమాకి బ్రేకులేశారు.
అయితే తాజాగా బాలకృష్ణ - బోయపాటి సినిమా ఫిబ్రవరి 13 నుండి మొదలుకాబోతుందంటూ ఓ న్యూస్ ఫిలింసర్కిల్స్‌లో నడుస్తుంది. ఇది విన్న బాలయ్య ఫ్యాన్స్ బోయపాటితో సినిమా అంటే బాలయ్య హిట్ పక్కా అంటూ సంబరాలకు రెడీ అవుతున్నారు. బాలయ్య ఫ్యాన్స్ సంబరాలేమో గానీ, ఇప్పుడు బాలయ్య మాత్రం హీరోయిన్ విషయంలో తలపట్టుకున్నాడట. ముందుగా బాలయ్య కోసం బోయపాటి, కేథరిన్‌ని తీసుకొస్తున్నాడని అన్నారు. కేథరిన్‌కి 80 లక్షల భారీ పారితోషకం అంటూ ప్రచారం జరిగింది. బోయపాటి మాటకు విలువనిచ్చి కేథరిన్, బాలకృష్ణ తో జోడీకడుతుందని అన్నారు. అయితే తాజాగా కేథరిన్, బాలయ్య సినిమాకి హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు బోయపాటి మరో హీరోయిన్ సెట్ చేసుకోవాలట. మరి బాలయ్యకి ఎప్పటినుండో హీరోయిన్స్ కొరత ఉంది. రూలర్ చూస్తే బాలయ్యకి ఏ రేంజ్ హీరోయిన్స్ కొరత ఉందో తెలుస్తుంది. మరి బోయపాటి ఈసారి ఏ హీరోయిన్‌ని బాలయ్యకి సెట్ చేస్తాడో చూడాలి.