సినిమా ఇండస్ట్రీలో సెలెబ్రిటీలు పెళ్ళిళ్ళు చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, ఆపై మళ్ళీ పెళ్ళి చేసుకోవడం మామూలే. సాధారణంగా పబ్లిక్ ఫిగర్లు కాబట్టి సెలెబ్రిటీల పర్సనల్ జీవితాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే సెలెబ్రిటీలు కొన్ని విషయాలని బయటకి చెప్పడానికి ఇష్టపడరు. కానీ పుకార్ల వల్లనో, మరో దాని వల్లనో ఆ విషయాలు బయటకి వచ్చేస్తుంటాయి. అయితే తాజాగా మంచు మనోజ్ ఒక విషయాన్ని బయటకి చెప్పడానికి రెడీ అవుతున్నాడు.
మంచు మనోజ్ సినిమా కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. అదీ గాక ఈ మధ్య సినిమాలకి కూడా చాలా దూరంగా ఉంటున్నాడు. సామాజిక కార్యక్రమాలతోనూ, రాజకీయ కార్యకలాపాలతో ప్రజల ముందుకి వస్తున్నాడు. అయితే మంచు మనోజ్ పెళ్ళి చేసుకుని, విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే మనోజ్ ఎందుకు విడాకులు తీసుకున్నారన్నది ప్రతీ ఒక్కరికీ ఆసక్తి కలిగించే విషయమే.
ఆ ఆసక్తి జనాల్లో ఇంకా ఉంది. ఇలాంటి టైమ్ లో మనోజ్ ఏదో కొత్త విషయం చెప్పడానికి రెడీ అవుతున్నాడట. ఈ మేరకు మనోజ్ ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో పంచుకోవాలని చూస్తున్నాడట. అయితే ఆ విషయం ఏమై ఉంటుందని అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే కొందరు తమ ఆతృతని ఆపుకోలేక పెళ్ళి గురించా అని అడిగారు. అప్పుడు దానికి మనోజ్ ఇచ్చిన జవాబు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
పెళ్ళి గురించా అని అడగగానే.... వామ్మో అని సమాధానం ఇవ్వడంతో మనోజ్ కి పెళ్ళి అంటే ఎంతటి విరక్తి కలిగిందో తెలుస్తుంది. ఇండస్ట్రీలో విడాకుల విడాకుల తర్వాత మళ్లీ పెళ్ళి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మనోజ్ ఇలా అనడంతో మళ్ళీ పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యమే లేదని అర్థం అవుతోంది.