విలక్షణమైన పాత్రలో నేచురల్ స్టార్ నాని... ‘వి’ సినిమాలో నాని ఫస్ట్ లుక్ విడుదల
అష్టాచమ్మా, జెంటిల్‌మన్ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నేచురల్‌స్టార్ నానిని సరికొత్తగా ఆవిష్కరించారు డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘వి’. ఈసారి కూడా డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి మరో కొత్త పాత్రలో నానిని తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఆ పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ‘వి’ సినిమా చూడాల్సిందే. శాంపుల్‌గా నాని లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటి వరకు నాని పోషించని సరికొత్త పాత్ర, లుక్‌లో కనపడుతున్నారు. గడ్డం, మెలితిప్పిన మీసాలు, చేతిలో కత్తెర, చేతికి రక్తం, చూపుల్లో నిర్లక్ష్యం ఇవన్నీ చూస్తుంటే నాని పాత్రలోని డెప్త్ అర్థం చేసుకోవచ్చు.
క్లాస్, మాస్ పాత్రలతో ఆకట్టుకున్న నాని తొలిసారి విలక్షణమైన పాత్రలో నటిస్తున్నారు. రాక్షసుడి తరహా పాత్రలో నాని కనపడతారని హీరో సుధీర్‌బాబు ఇది వరకే ట్వీట్ కూడా చేశారు. రాక్షసుడి బారి నుండి కాపాడే సేవియర్ పాత్రధారి పవర్‌ఫుల్ ఐపీయస్ ఆఫీసర్‌గా సుధీర్‌బాబు నటిస్తున్నారు. నాని, సుధీర్‌బాబు పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు పోటాపోటీగా ఉంటాయని చిత్ర యూనిట్ తెలియజేసింది.
నేను లోకల్, ఎంసీఎ వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు.. నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం కావడం విశేషం. నానితో ఒక పక్క దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, మరో పక్క నిర్మాత దిల్‌రాజు రూపొందిస్తోన్న హ్యాట్రిక్ చిత్రం ‘వి’ కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. నాని నటిస్తోన్న 25వ చిత్రమిది. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిలర్ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న ఈ సినిమాను ఉగాది సందర్భంగా మార్చి25న విడుదల చేస్తున్నారు.
నటీనటులు:
నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి తదితరులు
సాంకేతిక వర్గం:
మ్యూజిక్: అమిత్ త్రివేది
సినిమాటోగ్రఫీ: పి.జి.విందా
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్
నిర్మాతలు: రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి
రచన, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి