తెలుగు సినిమాలకి అమెరికాలో మంచి మార్కెట్ ఉంది. ఈ సంక్రాంతి సినిమాల ద్వారా మన సినిమాలకి అక్కడ మార్కెట్ ఎంతలా ఉందనేది మరోసారి రుజువైంది. అయితే అన్ని సినిమాలకి అలా ఉండకపోవచ్చు. హీరోని బట్టి, దర్శకుడిని బట్టి సినిమా వసూళ్ళు ఉంటాయి. దర్శకుడిని బట్టి చూస్తే రాజమౌళి బాహుబలిని పక్కన పెడితే అంతటి మార్కెట్ ఉన్న దర్శకుడు ఒక్క త్రివిక్రమ్ అనే చెప్పాలి. నితిన్ తో చేసిన 'అ ఆ' సినిమాకి సైతం రెండు మిలియన్లకి పైగా వసూళ్ళు సాధించాడంటే అక్కడ త్రివిక్రమ్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.
అయితే త్రివిక్రమ్ తర్వాత ఒక దర్శకుడిగా ఓవర్సీస్ లో ముఖ్యంగా అమెరికాలో మంచి మార్కెట్ సంపాదించుకుంది శేఖర్ కమ్ముల అని చెప్పుకోవచ్చు. శేఖర్ కమ్ముల ఇప్పటి వరకు మిడ్ రేంజ్ హీరోలతోనే సినిమాలు తీశాడు. ఆయన దర్శకత్వం వహించిన ఫిదా సినిమా రెండు మిలియన్ల క్లబ్బులో చేరిపోయింది. అయితే ఇప్పుడు అదే పరిస్థితి శేఖర్ కమ్ముల అప్ కమింగ్ మూవీకి కూడా ఏర్పడనుంది.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగచైతన్య తో 'లవ్ స్టోరీ' అనే సినిమా చేస్తున్నాడు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా అమెరికాలో ఐదున్నర కోట్లకి అమ్ముడయ్యి నాగచైతన్య కెరీర్లోనే హయ్యెస్ట్ గా నిలిచింది. దీనికి కారణం శేఖర్ కమ్ములే కారణమని చెప్పకుండా ఉండలేం. ఫిధా సినిమా ద్వారా ప్రేక్షకులని ఫిధా చేసిన కమ్ముల లవ్ స్టోరీ సినిమాతో మళ్ళీ అలాంటి మాయాజాలం చేస్తాడేమో చూడాలి.