Advertisementt

బన్నీ-సుక్కు మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా!?

Tue 28th Jan 2020 05:19 PM
bunny-sukku movie,allu arjun,sukumar,release date,rrr  బన్నీ-సుక్కు మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా!?
Bunny-Sukku Movie Release Date Fix!! బన్నీ-సుక్కు మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా!?
Advertisement
Ads by CJ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిస్తున్న క్రేజీ మూవీ పూజా కార్యక్రమాలతో ఇదివరకే ప్రారంభమైన సంగతి తెలిసిందే. బన్నీ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోంది. ‘ఆర్య’, ‘ఆర్య- ’2 చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడం విశేషమని చెప్పుకోవచ్చు. గతంలో అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. అంటే ముగ్గురికీ ముచ్చటగా మూడో సినిమా అన్న మాట. ఈ ముగ్గురూ కలిశారంటే హ్యాట్రిక్ పక్కా అని చెప్పుకోవచ్చు.

సినిమా ఇప్పటికే బన్నీ లేకుండానే షూటింగ్ షురూ చేయడం జరిగింది. త్వరలోనే బన్నీకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. మరోవైపు.. అదేదో సామెత ఉందిగా.. ఆలు లేదు సూలు లేదు.... అన్నట్లుగా ఇదిగో సినిమా ఫలానా రోజు రిలీజ్ అవుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా షూటింగ్ వీలైనంత త్వరగానే ముగించేసుకుని ఆగస్టు-15 లేదా సెప్టెంబర్ మాసంలో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. మైత్రీ మేకర్స్ కూడా సెప్టెంబర్‌ మాసాన్నే అనుకున్నారట. అంటే.. జక్కన్న తెరకెక్కిస్తున్న RRR తర్వాత విడుదల కానుందన్న మాట. ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది మరి.

Bunny-Sukku Movie Release Date Fix!!:

Bunny-Sukku Movie Release Date Fix!!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ