Advertisementt

పదే పదే అవే తప్పులెందుకు పవన్ కల్యాణ్!?

Mon 27th Jan 2020 03:22 PM
janasena,janasena chief,pawan kalyan,politcs,tollywood  పదే పదే అవే తప్పులెందుకు పవన్ కల్యాణ్!?
Why Janasena Chief Pawan Makes Mistakes Again and Again! పదే పదే అవే తప్పులెందుకు పవన్ కల్యాణ్!?
Advertisement
Ads by CJ

రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. ఇక సినిమాల జోలికి వెళ్లనని ఫుల్‌స్టాప్ పెట్టేసినట్లేనని స్వయంగా ప్రకటించాడు.. అంతేకాదు మెగాబ్రదర్ నాగబాబు కూడా ఈ విషయాన్ని చాలా సుస్పష్టంగా చెప్పాడు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ మళ్లీ బాలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్టయిన ‘పింక్’ రీమేక్ ద్వారా పవన్ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సంక్రాంతి పండుగ అనంతరం సినిమా కూడా షూటింగ్ ప్రారంభమైంది. మరోవైపు ఈ సినిమాలో నటీనటులెవరు..? అనే విషయం తెలియరాలేదు. ఈ సినిమాను శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తుండగా.. సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే పవన్ లేకుండానే కొన్ని కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేయగా.. తాజాగానే జనసేనాని రంగంలోకి దిగారు.

కాగా.. ఈ సినిమా అనంతరం డైరెక్టర్‌ క్రిష్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ‘పింక్’ రీమేక్ పూర్తయిన రోజుల వ్యవధిలోనే షూటింగ్‌లో పాల్గొనాలని ఆయన ఫిక్సయ్యారట. ఈ సినిమా స్టోరీ చాలా బాగా నచ్చడంతో మారుమాట చెప్పలేక పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ సినిమాలో ఇదివరకెన్నడూ లేని విధంగా పవన్‌ను క్రిష్ చూపించబోతున్నారట. అంతేకాదు.. సినిమాలో పవన్ పాత్ర ఇలా ఉంటుంది..? హీరోయిన్ ఫలానా బ్యూటీనే అని కూడా వార్తలు గుప్పుమన్నాయి.

మరోవైపు ఇద్దరు కూడా అంతంత మాత్రం డైరెక్టర్స్ కావడం.. హిట్ చూసి చాలా రోజులు కావడంతో వీరిద్దరూ ఎలా తెరకెక్కిస్తారో..? ఏంటో..? సినిమా హిట్ అయితే పర్లేదు.. ఫ్లాప్ అయ్యే పరిస్థితులు ఉంటే ఏంటి..? అనే పవన్ వీరాభిమానులు టెన్షన్ టెన్షన్ పడుతున్నారు. మరోవైపు.. జనసేనాని కూడా కాస్త హడావుడి చెందుతున్నాడట. అయితే.. పవన్ పదే పదే ఇలాంటి తప్పులెందుకు చేస్తున్నాడు..? ఇప్పటికే ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, కాటమరాయుడు’,‘అజ్ఞాతవాసి’ లాంటి సినిమాలు ప్లాప్ అవ్వడంతో పవన్ ఇక సినిమాల వైపు రాలేదు. అయితే వస్తే గిస్తే మంచి ఫేమస్ డైరెక్టర్‌తో రీ ఎంట్రీ ఇవ్వాల్సింది పోయి.. ఇలా ఎందుకు ఒప్పుకున్నట్లు..? అని మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. మరోవైపు.. జనసేనాని ఇమేజ్‌, క్రేజీకి తగ్గ డైరెక్టర్లు ఈ ఇద్దరు కాదని ఇండస్ట్రీలో చాలామంది అంటున్నారు. ఫైనల్‌గా పవన్‌ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలన్న మాట.

Why Janasena Chief Pawan Makes Mistakes Again and Again!:

Why Janasena Chief Pawan Makes Mistakes Again and Again!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ