Advertisementt

వెంకీ ‘నారప్ప’ కోసం ఒక్కరు కాదు ఇద్దరు!

Sun 26th Jan 2020 09:36 PM
naarappa,narappa,directors,srikanth addala,bobby,venkatesh  వెంకీ ‘నారప్ప’ కోసం ఒక్కరు కాదు ఇద్దరు!
Two Directors to Venkatesh Naarappa Movie వెంకీ ‘నారప్ప’ కోసం ఒక్కరు కాదు ఇద్దరు!
Advertisement
Ads by CJ

వెంకటేష్ తమిళ అసురన్ రీమేక్ నారప్పని అధికారికంగా పట్టాలెక్కించేసాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ధనుష్ అసురన్ సినిమాని తెలుగులో నారప్పగా చేస్తున్నాడు వెంకటేష్. అసురన్‌ని యాజిటీజ్‌గా దింపేస్తున్నారని వెంకటేష్ నారప్ప లుక్ చూస్తే అర్ధమవుతుంది. ధనుష్ అసురన్ లుక్‌కి నారప్ప లుక్‌కి పెద్దగా తేడా లేదు. సేమ్ టు సేమ్ ఉంది. దాన్నిబట్టి అసురన్ మాతృకని చెడగొట్టే ప్రయత్నాలేమీ జరగడం లేదని తెలుస్తుంది. అయితే ఈ సినిమాని సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు అనగానే వెంకీ ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. అసలే డిజాస్టర్ డైరెక్టర్ అని. కానీ వెంకటేష్ మాత్రం శ్రీకాంత్ అడ్డాలకే కనెక్ట్ అయ్యాడు.

అయితే అసురన్ సినిమా మొత్తం దళితుల తిరుగుబాటు నేపథ్యంలో ఉంటుంది. ఇప్పుడు నారప్ప సినిమా కూడా అదే కథతో తెరకెక్కుతుంది. కాకపోతే కొంతమేర అనంతపురం, కారంచేడు నరమేధ ఘటనను ఆధారంగా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దళితులకు, అగ్రవర్ణాలకు మధ్యన దళితులు ఏ విధంగా అన్యాయం అయ్యారో.. అగ్రవర్ణాల చేతిలో దళితుల మరణాలు ఎలా సంభవించాయి అనేది నారప్పలో చూపించబోతున్నారట. అయితే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం మరో దర్శకుడు దిగుతున్నట్టుగా  చెబుతున్నారు వెంకిమామ సినిమాని వెంకటేష్ తో చేసిన దర్శకుడు బాబీ, నారప్ప సినిమా యాక్షన్ పార్ట్ ని చిత్రీకరించబోతున్నాడట. సినిమా మొత్తం శ్రీకాంత్ అడ్డాల, కేవలం ఫైటింగ్ సీన్స్ బాబీ డైరెక్ట్ చేస్తారన్నమాట. అందుకే నారప్ప కోసం ఇద్దరు దిగుతున్నారు అని అన్నది.

Two Directors to Venkatesh Naarappa Movie:

Srikanth Addala and Bobby to Directs Naarappa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ