Advertisementt

నాగ్ మూవీలో చైతూ కీలక పాత్ర!!

Sun 26th Jan 2020 02:15 PM
naga chaitanya,nagarjuna,bangarraju,key role,nag movie  నాగ్ మూవీలో చైతూ కీలక పాత్ర!!
Naga Chaitanya Key role In Nag Movie!! నాగ్ మూవీలో చైతూ కీలక పాత్ర!!
Advertisement
Ads by CJ

అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్‌ కృష్ణ తెరకెక్కించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సూపర్ డూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. అయితే అదే ఊపు మీద ఈ కాంబోలో సీక్వెల్ చేసేయాలని భావించినప్పటికీ వర్కవుట్ కాలేదు. అయితే.. ‘బంగార్రాజు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసేశారు. ప్రస్తుతం నాగ్ ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటిస్తుండటంతో ఆ తర్వాత ‘బంగార్రాజు’గా అక్కినేని అభిమానులు, సినీ ప్రియుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో నాగ్ కుమారుడు నాగ చైతన్య అలియాస్ చైతూ కీలక పాత్రలో నటిస్తున్నారన్నదే దాని సారాంశం.

నాగ్-రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించనున్న ఈ సినిమాలో.. నాగచైతన్య ముఖ్యమైన పాత్రలో కనిపించి మెప్పిస్తారట. ఈయన పాత్ర ఉండేది కాసేపే అయినా సినిమాకు ఇదే కీలకమట. మరోవైపు.. అనూప్ రూబెన్స్‌ను ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా కళ్యాణ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి మూడో వారంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభవుతుందట. మరి తాజా చక్కర్లపై క్లారిటీ ఎప్పుడొస్తుందో వేచి చూడాల్సిందే.

Naga Chaitanya Key role In Nag Movie!!:

Naga Chaitanya Key role In Nag Movie!!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ