అవును మీరు వింటున్నది నిజమే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్లాడట. గతంలో షూటింగ్ సమయంలో తాకిన గాయం బాగా ఇబ్బంది పెడుతోందట. అందుకే ఆయన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు ముందే అమెరికాకు వెళ్లాలని భావించినప్పటికీ.. వీలుకాకపోవడంతో ఇప్పుడు వెళ్లాలని భావించాడట. ఇంతకీ అసలేం జరిగింది..? మహేశ్‌కు గాయమెక్కడైంది..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
‘ఆగడు’ సినిమా షూటింగ్ సమయంలో మహేశ్ కాలికి గాయమైందని అప్పట్లో వార్తలు గుప్పమన్న విషయం విదితమే. అయితే.. ఆ గాయం నుంచి సూపర్‌స్టార్ ఇంకా పూర్తిగా కోలుకోలేదట. ఆ గాయాన్ని మహేశ్ కూడా పెద్దగా పట్టించుకోకుండా సినిమాల్లో బిజీబిజీగా ఉండటంతో నొప్పి ఎక్కువగా ఉండటంతో మహేశ్ అమెరికాకు పయనమయ్యాడట. ఆపరేషన్ చేయించుకుని అక్కడే రెండు నెలల పాటు ఉంటారట. అంతేకాదు.. ఆపరేషన్ అయిన తర్వాత నాలుగైదు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని ఇప్పటికే వైద్యులను సంప్రదించగా మహేశ్‌కు సూచించారట. మొత్తానికి చూస్తే మొత్తం ఏడు నెలలపాటు మహేశ్ సినిమా షూటింగ్‌కు దూరంగా ఉంటారన్న మాట.
కాగా.. తన తదుపరి చిత్రం వంశీపైడిపల్లితో సినిమా ఉంటుందని మహేశ్ బాబు స్వయంగా మీడియా ముఖంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే మహేశ్ అమెరికాకు వెళ్లడంతో ఏడు నెలలపాటు షూటింగ్ ఉండదన్న మాట. అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వంశీ-మహేశ్ కాంబోలోని సినిమా తెరకెక్కనుందన్న మాట. మహేశ్‌కు ఆపరేషన్ అంటూ గత రెండ్రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలతో వీరాభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ ఆపరేషన్ అనేది పుకారేనా లేకుంటే నిజమా అనేది తెలియాలంటే సూపర్ స్టార్ రియాక్ట్ అయ్యేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.