Advertisementt

బోయపాటిని పరామర్శించిన అల్లు అర్జున్..

Sat 25th Jan 2020 04:12 PM
allu arjun,boyapati srinu house,boyapati mother  బోయపాటిని పరామర్శించిన అల్లు అర్జున్..
Allu Arjun Visits Boyapati Srinu House.. Details Here.. బోయపాటిని పరామర్శించిన అల్లు అర్జున్..
Advertisement
Ads by CJ

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ఇంట విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బోయపాటి తల్లి సీతారావమ్మ ఇటీవల తుదిశ్వాస విడిచారు. కాగా.. తల్లి మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న బోయపాటిని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ అలియాస్ బన్నీ పరామర్శించారు. శుక్రవారం నాడు బోయపాటి స్వగ్రామం గుంటూరు జిల్లా పెద్దకాకాని వెళ్లిన అల్లు అర్జున్.. బోయపాటిని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా సీతారావమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించిన బన్నీ.. బోయపాటి కుటుంబసభ్యులను ఓదార్చారు. 

అనంతరం.. బన్నీ-బోయపాటి ఇద్దరూ మాట్లాడుకున్నారు. అసలేం జరిగింది..? సీతారావమ్మ ఎలా మరణించారు..? అనే విషయాలను బన్నీ ఆరా తీశారు. సుమారు అరగంట పాటు బన్నీ.. బోయపాటి ఇంట్లోనే గడిపారు. బన్నీ గుంటూరు వచ్చినట్లు తెలుసుకున్న వీరాభిమానులు, మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున బోయపాటి ఇంటికి చేరుకున్నారు. అందరికీ ఆప్యాయంగా పలకరించిన బన్నీ.. హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఇదిలా ఉంటే.. బోయపాటి- బన్నీ కాంబినేషన్‌లో వచ్చిన ‘సరైనోడు’ మాస్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Allu Arjun Visits Boyapati Srinu House.. Details Here..:

Allu Arjun Visits Boyapati Srinu House.. Details Here..  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ