దక్షిణాది స్లిమ్ బ్యూటీగా పేరుగాంచిన త్రిష గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో ఓ ఊపు ఊపిన ఈ భామ సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరితోనూ నటించి మెప్పించింది. తన అంద చెందాలు ఒలకబోసి తెలుగులోనూ పెద్దఎత్తున అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం అంతగా అటు ఇటు రెండు చోట్లా అవకాశాల్లేవ్. అప్పట్లోనే సినిమా అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకోవాలని భావించిన ఈ భామ.. ఎందుకో కొన్ని అనివార్య కారణాల వల్ల వెనక్కి తగ్గింది. అయితే.. తాజాగా పెళ్లి వ్యవహారం ప్రస్తావన రాగా చిరాకు చిరుకుగా మాట్లాడేస్తోంది.
ఇంతకీ ఈ స్లిమ్ బ్యూటీ ఇంతలా ఎందుకు చిరాకుగా మాట్లాడుతోందని ఆరా తీయగా అసలు విషయం ఆమె నోటితోనే చెప్పింది. సినిమాలున్నా లేకున్నా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ మాత్రం అభిమానులు, నెటిజన్లకు అందుబాటులో ఉంటూ అప్పుడప్పుడు ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్‌తో ఇంట్రాక్ట్ అవుతుంటుంది. ఇందులో భాగంగా ఇటీవల తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ఈ స్లిమ్ బ్యూటీ మాట్లాడింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఈ బ్యూటీ ఆసక్తికరంగా బదులిచ్చింది. ఈ సందర్భంగా పెళ్లి గురించి ఓ వీరాభిమాని.. ఈ చెన్నై పొన్నును ప్రశ్నించగా చాలా లాజిక్‌గా, ఆసక్తికరంగా సమాధానమిచ్చింది.
‘నాకు కూడా కొన్ని కలలు ఉన్నాయి. వివాహ వ్యవస్థపై నాకు నమ్మకం లేదు. నాకు నచ్చిన మగాడు దొరికి, పెళ్లంటూ చేసుకుంటే వెగాస్‌లోనే చేసుకుంటాను. అదే నా డ్రీమ్ లిస్ట్‌లో ఉన్న క్రేజీ డ్రీమ్’ అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. అని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పొన్నియిన్ సెల్వన్’, మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రంలో త్రిష నటిస్తోంది. చిరు సరసన నయనతార, కాజల్, తమన్నా, హ్యుమ ఖురేషి పేర్లు ప్రచారం జరగ్గా.. ఆ తర్వాత కొన్ని రోజులు ఏకంగా త్రిష పేరే వినడింది. అయితే చిరు-త్రిష ఇద్దరూ కలిసి ఇదివరకే నటించారు. వీరి రొమాన్స్‌కు, చిరు సరసన నటనకు త్రిషకు మంచి మార్కులు పడ్డాయి. అయితే చిరు సరసన త్రిష పక్కా అని పెద్ద ఎత్తున పుకార్లు రాగా.. ఆ పుకార్లే అక్షరాలా నిజమయ్యాయి.!