Advertisementt

బండ్ల గణేష్ హర్టయ్యాడట.. ఎందుకంటే?

Fri 24th Jan 2020 01:58 PM
bandla ganesh,scenes,removed,mahesh babu,anil ravipudi,sarileru neekevvaru  బండ్ల గణేష్ హర్టయ్యాడట.. ఎందుకంటే?
Bandla Ganesh Not Happy with Hil Role In Sarileru Neekevvaru బండ్ల గణేష్ హర్టయ్యాడట.. ఎందుకంటే?
Advertisement
Ads by CJ

ఒకప్పుడు టాప్ కమెడియన్, తర్వాత బడా నిర్మాత.. ఆ తర్వాత రాజకీయాలంటూ సినిమాలను పక్కనబెట్టి.. అది వర్కౌట్ అవ్వక చివరికి మళ్ళీ కమెడియన్ వేషాలు వెయ్యాలని డిసైడ్ అయ్యి.. మహేష్ సినిమాతో సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్.. సరిలేరు నీకెవ్వరు సినిమాతో సుడి తిరిగి మళ్ళీ సినిమాల్లో సెటిల్ అవ్వొచ్చని కలలు కనడమే కాదు.. రీఎంట్రీ విషయంలో పారితోషకం గట్టిగా అందుకున్నాడు. కానీ సినిమాలో బండ్ల గణేష్ పాత్రకి అస్సలు పేరు రాలేదు. అలాగే బండ్ల సీన్స్ ని సినిమా నిడివి ఎక్కువైంది అని కట్ చేసినట్లుగా బండ్ల సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట.

అనిల్ రావిపూడి తనకి చెప్పింది ఒకటి సినిమాలో తనని చూపించింది ఒకటి.. అనిల్ రావిపూడి తనని నిలువునా మోసం చేశాడంటూ... తెగ హార్ట్ అవుతున్నాడట. సరిలేరు నీకెవ్వరు సినిమాలో బండ్ల గణేష్ పాత్రకి బ్యాడ్ కామెంట్స్ పడుతుండడంతో.. బండ్ల తెగ ఫీలవుతున్నాడట. అనిల్ రాయపూడి మీద ఒంటి కాలుతో లేస్తున్నట్లుగా తెలుస్తుంది. అనిల్ రావిపూడి అంటే కామెడీకి కేరాఫ్ అడ్రెస్స్ అని తన పాత్ర మీద తెగ ఊహించుకున్నాడట. అలాగే బండ్ల అనిల్ రావిపూడి సినిమాలో అనగానే బండ్ల కేరెక్టర్ మీద మీడియా కూడా అంచనాలు పెంచెయ్యడం, సినిమా చూసాక అది కాస్త తుస్ మనడంతో.. బండ్లకి తలకొట్టేసినట్లుగా అయ్యిందట.

Bandla Ganesh Not Happy with Hil Role In Sarileru Neekevvaru:

Bandla Ganesh Scenes Removed in Sarileru Neekevvaru

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ