హీరో అవకాశాలు తగ్గాక మళ్లీ కమెడియన్ గా మారిన సునీల్ కి తాను ఆశించిన పాత్రలైతే రావడం లేదు కానీ... సినిమాల మీద సినిమాలు మాత్రం వస్తున్నాయి. తాజాగా అల వైకుంఠపురములో సినిమాలో నటించిన సునీల్.. రేపు విడుదలకాబోయే డిస్కో రాజా లోను నటించాడు. అయితే తాజాగా సునీల్ అస్వస్థతకి గురైనట్లుగా సమాచారం. గచ్చిబౌలిలోని ఏ.ఐ.జీ ప్రైవేటు ఆసుపత్రి లో సునీల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని.... ప్రస్తుతం సునీల్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నట్లుగా ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్న మాట.
అయితే సునీల్ గొంతు, లివర్ సమస్యతో బాధపడుతున్నట్టు సమాచారం. యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్లే సునీల్‌కు ఆ సమస్య వచ్చినట్లుగా తెలుస్తుంది. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సునీల్.. సడెన్‌గా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హాస్పటల్‌లో జాయిన్ చేసినట్లుగా సమాచారం. కానీ హాస్పిటల్ వర్గాలు మాత్రం సునీల్ ఆరోగ్య విషయాలేమి బయటికి చెప్పలేదు. అయితే సునీల్ అభిమానులు మాత్రం సునీల్ ఆరోగ్యం ఎలా ఉందో అంటూ ఆందోళన చెందుతున్నారు. మరి సునీల్ జనరల్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్లాడా? లేదా మరేదన్నానా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సునీల్ హాస్పటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.