Advertisementt

‘పింక్’ రీమేక్ నిర్మాతలపై పవన్ ఫైర్..?

Fri 24th Jan 2020 01:02 PM
pawan kalyan,pink remake,leaked photos,pink remake shooting,dil raju,serious  ‘పింక్’ రీమేక్ నిర్మాతలపై పవన్ ఫైర్..?
Pawan Kalyan angry on Pink Remake Producers ‘పింక్’ రీమేక్ నిర్మాతలపై పవన్ ఫైర్..?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు, సినిమాలు చేస్తున్నాడు. మాములుగా రాజకీయాలతో బిజీగా ఉండాల్సిన టైమ్‌లో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఓపక్క అమరావతి ప్రాబ్లెమ్, మరో పక్క కొత్త రాజధానులపై పోరాటంతో పవన్ కళ్యాణ్ మధ్యాహ్నాం అయ్యేసరికి అమరావతికి వచ్చేస్తున్నాడు. పొద్దున్నే పింక్ రీమేక్ అంటూ హైదరాబాదుకి వెళుతున్నాడు. రాజకీయాలు హాట్ హాట్ గా వున్నప్పుడు పవన్ సినిమాలు చెయ్యడం కరెక్ట్ కాదు. కానీ ఒప్పుకున్నాక చెయ్యక తప్పదు. అందుకే సినిమాల్లోకి రీ ఎంట్రీ విషయాన్ని ఎక్కడా చెప్పకుండా సైలెంట్ గా పింక్ రీమేక్ షూటింగ్ లో హాజరయ్యాడు పవన్.

అసలు పవన్ కళ్యాణ్ జనవరి 20 నుండి పింక్ రీమేక్ చేస్తున్నాడు అని మూవీ టీం కానీ, దిల్ రాజు కానీ చెప్పకుండానే పవన్ సినిమా లాయర్ సాబ్ పిక్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. దానితో పవన్ ఫాన్స్ ఆనందంతో.. ఆ పిక్ ని వైరల్ చేసి పడేశారు. అసలే సినిమాలు చేసుకుంటున్నాడంటూ రాజకీయనేతలు తనని ఫుడ్ బాల్ ఆడుకుంటారని తెలిసిన పవన్ సైలెంట్ గా పింక్ రీమేక్ పూర్తి చేద్దామనుకుంటే.. ఇక్కడ లీకైన పిక్‌తో పవన్ సినిమాలు చేసుకుంటాడు డబ్బు సంపాదిస్తున్నాడు.. ఇక అమరావతి ప్రజలకేం న్యాయం చేస్తాడంటూ  గొడవ చేస్తుండడంతో.. పవన్‌కి ఈ విషయం తెలిసి నిర్మాతలపై సీరియస్ అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. పింక్ రీమేక్ నిర్మాతని పిలిచి సెట్స్‌లోని ఫొటోలు లీక్ అవడంపై ఫైర్ అయ్యాడట. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనందుకు నిర్మాతలపై మండిపడినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. పవన్ దెబ్బకి నిర్మాతలు సెట్స్‌లో భారీ సెక్యూరిటీని పెంచినట్లుగా తెలుస్తోంది.

Pawan Kalyan angry on Pink Remake Producers:

Pawan Kalyan angry on Pink Remake leaked photos

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ