Advertisementt

‘సరిలేరు’తో బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుందట!

Thu 23rd Jan 2020 03:15 PM
sarileru neekevvaru,anil ravipudi,dil raju,anil sunkara,press meet  ‘సరిలేరు’తో బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుందట!
Sankranthiki Box-Office Daddarillipotondi: Anil Ravipudi ‘సరిలేరు’తో బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుందట!
Advertisement
Ads by CJ

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని మహేష్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు - ప్రముఖ నిర్మాత అనిల్‌ సుంకర.

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జి.ఎం.బి ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనిల్‌ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ప్రొఫెస‌ర్ భార‌తీగా లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త‌ రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..

ఇలాంటి సంక్రాంతిని ఇంత వ‌ర‌కూ చూడలేదు!!

సూపర్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలైంది. ఇలాంటి సంక్రాంతి ఇప్పటివరకూ చూడలేదు. కేవలం ఐదు నెలల్లోనే సూపర్‌స్టార్‌ మహేష్‌, అనిల్‌ రావిపూడి ఈ సినిమా కంప్లీట్‌ చేసి సరిలేరు మాకెవ్వరు అన్పించారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమాని బ్లాక్‌ బస్టర్‌ కా బాప్‌ అనే రేంజ్‌లో రెవెన్యూ క్రియేట్‌ చేసి, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నిజమైన సంక్రాంతి అనుకునేలాగా చేశారు. అనిల్‌ ఇప్పటివరకూ అయిదు సినిమాలు చేశారు. అయిదురు హీరోలకి వారి కెరీర్‌ బెస్ట్‌ సక్సెస్‌ ఇచ్చారు. అలాగే ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌కిగానీ, మా బేనర్‌కి గానీ హయ్యస్ట్‌ రెవెన్యూ కలెక్ట్‌ చేసిన సినిమాగా క్రియేట్‌ చేశారు. ఇంకా ఎంత కలెక్ట్‌ చేస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేం. అలాగే డిస్ట్రిబ్యూటర్స్‌కి ఎంత ప్రాఫిట్‌ కావాలో అంత ప్రాఫిట్‌ క్రియేట్‌ చేసి ఇచ్చారు. సంక్రాంతికి రావాలనే ఒక్క సంకల్పంతో అంత పెద్ద స్టార్‌ అయి ఉండి కూడా అయిదు నెలల్లోనే షూటింగ్‌ కంప్లీట్‌ చేసిన మహేష్‌బాబుగారికి థాంక్స్‌. ఈ సంక్రాంతికి ఇంత మంచి రెవెన్యూ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు.

అనిల్‌కి ఒన్‌ ఆఫ్‌ ది బిగ్గెస్ట్‌ అఛీవ్‌మెంట్‌!!

ప్రముఖ నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ.. ‘‘సంక్రాంతి ముగిసింది. పండగ సినిమాలకి ఇంకా సంక్రాంతి నడుస్తూనే ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’ మహేష్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఒక సూపర్‌స్టార్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అంటే సాధారణ విషయం కాదు. దర్శకుడు అనిల్‌ రావిపూడికి ఒన్‌ ఆఫ్‌ ది బిగ్గెస్ట్‌ అఛీవ్‌మెంట్‌. అనిల్‌ కష్టానికి తగ్గ ప్రతిఫలం మా అందరికీ లభించింది. ఈ సినిమాకి దిల్‌రాజుగారి కోపరేషన్‌ మరువలేనిది. మేం ఏదైతే అనుకున్నామో దానికన్నా ఎక్కువ కలెక్షన్స్‌ వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలోనే ది బెస్ట్‌ సంక్రాంతి అని మా డిస్ట్రిబ్యూటర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సంక్రాంతిలో మా సినిమా ఉండటం నిజంగా మా అదృష్టం’’ అన్నారు.

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‌ దద్దరిల్లిపోతోంది!!

యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘అందరూ చెప్పినట్లే తెలుగు సినిమా కళకళలాడుతోంది. సంక్రాంతికి బాక్సాఫీస్‌ దద్దరిల్లిపోతోంది. ఐయాం వెరీ హ్యాపీ. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్‌ చేసి మహేష్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంకా రెండు మూడు వారాలు రన్‌ ఉంది. అలాగే రిపీటెడ్‌గా చూడాలనుకునే ఆడియన్స్‌ కోసం ఒకటిన్నర నిమిషాల నిడివి గల సన్నివేశాన్ని యాడ్‌ చేస్తున్నాం. దాంతో ఇంకొంచెం నవ్వులు బోనస్‌గా లభిస్తాయి. ‘రమణా లోడు ఎత్తాలిరా’ అనే డైలాగ్‌కు మేం ఊహించినదాన్ని కన్నా ఎక్కువ రెస్పాన్స్‌ వచ్చింది. అందుకే మేము కూడా ‘రమణా బాక్సాఫీస్ లోడ్ ఎత్తాలిరా’ అంటున్నాం. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ఎంతో గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు.

Sankranthiki Box-Office Daddarillipotondi: Anil Ravipudi:

Thanks To Audience For Making ‘Sarileru Neekevvaru’ As The Biggest Hit In Superstar Mahesh Gari Career - Popular Producer Anil Sunkara

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ