అల వైకుంఠపురములో అల్లు అర్జున్‌కి ఎంత పేరొచ్చిందో.. ఆయన ఫాదర్‌గా నటించిన మురళీశర్మకి అంతే పేరొచ్చింది. అల్లు అర్జున్ మెయిన్ పిల్లర్ అయితే.. మురళీశర్మ మిడిల్ పిల్లర్‌లా అల వైకుంఠపురములో చిత్రాన్ని అంతెంతుకు లేపారు. మురళీశర్మ హావభావాలు, పాత్ర తీరు అన్ని అద్భుతంగా పండాయి. అంతలా నటించిన మురళీశర్మని ఇప్పుడు అల వైకుంఠపురములో నిర్మాణ సంస్థలలో ఒకటైన గీతా ఆర్ట్స్ బాధపెట్టిందనే రూమర్స్ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అల వైకుంఠపురములో హిట్‌లో భాగస్వామి అయిన మురళీశర్మ అల వైకుంఠపురములో సక్సెస్ సెలెబ్రేషన్స్‌కి హాజరుకాకపోవడంతో ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూర్చినట్లయింది.
మాములుగా మురళీశర్మ కాల్షీట్స్ లెక్కన కాకుండా రోజుకింతని పారితోషకం తీసుకుంటాడట. అయితే అల వైకుంఠపురములో 50 రోజుల డేట్స్‌కి ఇంతని పారితోషకం మురళీశర్మకి ఫిక్స్ చేశారట. అయితే అటు ఇటుగా మురళీశర్మ అల వైకుంఠపురములో సినిమా కోసం 70 రోజుల కాల్షీట్స్ వాడాడట. అంటే 70 రోజులు అల షూటింగ్‌కి హాజరయ్యాడన్నమాట. అయితే ముందు 50 రోజులకు అనుకున్నట్టుగా 50 రోజుల పారితోషకమే ఇచ్చి.. మిగతా 20 రోజుల పారితోషకం విషయంలో మురళీశర్మని ముప్పుతిప్పలు పెడుతున్నారట. మురళీశర్మ మిగతా 20 రోజులకు పారితోషకం డిమాండ్ చేసినా.. నిర్మాణ సంస్థ పట్టించుకోకపోవడం వల్లే.. మురళీశర్మ హర్టయ్యాడని, అందుకే ‘అల..’ సక్సెస్ ఈవెంట్స్‌లో ఆయన కనిపించలేదనేది ఈ రూమర్స్‌లోని సారాంశం. మరి ఈ రూమర్స్‌పై చిత్రనిర్మాతలు ఎలా స్పందిస్తారో వెయిట్ అండ్ సీ.