Advertisementt

రష్మికా మందన్న.. పవన్ డైలాగ్‌కి ఫిక్సయింది

Tue 21st Jan 2020 02:06 PM
rashmika mandanna,heroine,pawan kalyan,dialogue,sarileru neekevvaru  రష్మికా మందన్న.. పవన్ డైలాగ్‌కి ఫిక్సయింది
Rashmika Mandanna Says Pawan Kalyan Movie Dialogue రష్మికా మందన్న.. పవన్ డైలాగ్‌కి ఫిక్సయింది
Advertisement
Ads by CJ

కన్నడ నుండి తార జువ్వలా దూసుకొచ్చిన తార రష్మికా మందన్న.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ రేంజ్ కి దగ్గరలో ఉంది. సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ కొట్టిన రష్మిక... యంగ్ అండ్ స్టార్ హీరోలకు ఆప్షన్‌గా మారింది. మరి చాలా త్వరగా సక్సెస్ అందుకున్న రష్మిక నాతో నాకే పోటీ అంటూ పవన్ డైలాగ్ చెబుతోంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో.. ఇంత పోటీ నేను తట్టుకోగలనా అంటూ భయపడే దాన్ని అని.. తర్వాత నాతో నాకే పోటీ అని డిసైడ్ అయ్యి.. సినిమాల కన్నా ఎక్కువగా కథలను ఎంపికలో దృష్టి పెట్టాలని, అలాగే సినిమాల ఎంపిక, కథలు ఎంపిక విషయం పక్కనబెట్టి.. బాగా నటించాలి అని అనుకుంటూ నాకు నేనే సవాల్ విసురుకునేదాన్ని అని చెబుతుంది.

నేను నటించిన సినిమా విడుదలయ్యాక.. ఆ సినిమాలో నా బలహీనత ఏమిటి అని వెతుక్కుంటా అని.. అప్పుడు దాని మీద ప్రత్యేక శ్రద్ద పెట్టి సాధన చేస్తా అని చెబుతున్న రష్మిక, సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత కామెడీ, డాన్స్ ల మీద ఫుల్ గా ఫోకస్ పెట్టినట్లుగా చెబుతుంది. అవి రెండు సరిలేరు‌లో నా బలహీనతలుగా ఉన్నాయి... ఇంకెప్పుడు అలా జరగకూడదని... నెక్స్ట్ మూవీలో అదే నా బలంగా మలచుకుంటా అని చెబుతుంది. మరి సరిలేరులో రష్మిక పాత్ర చూసాక చాలామంది మంచి కథలున్న సినిమాలే చేస్తానన్న రశ్మిక.... స్టార్ మహేష్ ని చూసి టెంప్ట్ అయ్యి.. ఇలాంటి బలహీనత పాత్ర ఒప్పేసుకుంది అంటూ సోషల్ మీడియా లో ట్రోల్ చేసిన విషయం తెలిసిందే.

Rashmika Mandanna Says Pawan Kalyan Movie Dialogue:

Rashmika Mandanna About her Cine Career

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ