Advertisementt

అదేంటి? ప్రభాస్ ఫిల్మ్ వాయిదాకి పూజా కారణం అన్నారుగా?

Mon 20th Jan 2020 03:26 PM
prabhas,pooja hegde,trolling,ala vaikuntapurramloo movie,success meet,krishnam raju  అదేంటి? ప్రభాస్ ఫిల్మ్ వాయిదాకి పూజా కారణం అన్నారుగా?
Trolling on Pooja Hegde about Prabhas Film Postponement అదేంటి? ప్రభాస్ ఫిల్మ్ వాయిదాకి పూజా కారణం అన్నారుగా?
Advertisement
Ads by CJ

ప్రభాస్ సినిమా లుక్ వదలడం, సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది అని చెప్పిన రెండో రోజే ప్రభాస్ - రాధాకృష్ణ సినిమా షూటింగ్‌కి బ్రేకివ్వడం, దానితో సినిమా 2020 నుండి 2021 కి వెళ్ళిపోయినట్టుగా ప్రచారం జరిగింది. ఫస్ట్ లుక్‌లో టైటిల్‌ని అనౌన్స్ చేయకుండా దాచేసిన ప్రభాస్ టీం పూజాహెగ్డే అనారోగ్యం కారణంతో ప్రభాస్ - పూజా హెగ్డే నటించాల్సిన సెకండ్ షెడ్యూల్‌కి బ్రేకిచ్చినట్లుగా చెప్పారు. అల వైకుంఠపురములో ప్రమోషన్స్, అఖిల్ సినిమా షూటింగ్‌తో క్షణం తీరిక లేని పూజ సిక్ అయినందువలనే ప్రభాస్ సినిమా షూటింగ్‌కి హాజరవలేదన్నారు.

కానీ తాజాగా పూజా హెగ్డే అల వైకుంఠపురములో సక్సెస్ సెలెబ్రేషన్స్ కోసం వైజాగ్‌లో దిగింది. దబ్బ పండులా మెరిసిపోతున్న పూజా హెగ్డే‌కి నీరసం ఏమిటి? పూజా వలన ప్రభాస్ సినిమా షూటింగ్‌కి బ్రేక్ రావడమేమిటి? అంటూ పూజాని ట్రోల్ చేస్తున్నారు. హిట్ సినిమా బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో యాక్టీవ్‌గా ఉన్న పూజాని చూసిన ఎవ్వరన్నా అలాగే అంటారు. అయితే ప్రభాస్ సినిమా షూటింగ్ పూజా వలన వాయిదా పడలేదనేది లేటెస్ట్ న్యూస్. ఇతర కారణాల వలన ప్రభాస్ - రాధాకృష్ణ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఆగిందని అంటున్నారు. 

ఇక కృష్ణంరాజు బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో తాను ప్రభాస్ సినిమాలో ఓ రోల్ చేస్తున్నట్లుగా చెప్పాడు. అలాగే ఈ సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ హైద్రాబాద్‌లో మొదలయ్యిందని.. ఇక్కడే హైదరాబాద్‌లోనే మూడు నెలల షూటింగ్ ఉంటుందని.. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ కంప్లీట్ చేసి.... వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నామని స్వయానా కృష్ణంరాజే ప్రకటించడంతో ప్రభాస్ ఈ ఏడాదిలో ప్రేక్షకులకు హ్యాండ్ ఇచ్చాడని క్లారిటీ వచ్చేసింది. 

Trolling on Pooja Hegde about Prabhas Film Postponement:

Gossips on Pooja Hegde for Prabhas Film Postponement

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ