దర్శకుడు త్రివిక్రమ్ ఎప్పుడూ తన పంచ్ డైలాగ్స్ ని నమ్ముకునే సినిమాలు తీస్తాడు. మరోపక్క ఏదైనా భాషలో సినిమా తనకి నచ్చితే దానిని స్ఫూర్తిగా తీసుకుని తను కథ రాసుకోవడమో.. పాత సినిమాలను కొత్త తరానికి నచ్చేలా తియ్యడమో చేసినా.. త్రివిక్రమ్ సినిమాలంటే పడి చచ్చే ఫ్యాన్స్ కోకొల్లలు. ఇక అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేది... నిన్నగాక మొన్నొచ్చిన అల వైకుంఠపురములో ఇలా ఈ సినిమాల్లో త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనబడుతుంది. ఇక ఎన్టీఆర్ కోసం ‘అరవింద సమేత’ అనే మాస్ సినిమా తీసాడు కానీ.. అది త్రివిక్రమ్‌కి విరుద్ధమైన పాలసీ. అయినా ఎన్టీఆర్ కోసం చేసాడు.
ఇక తాజాగా అల వైకుంఠపురములో త్రివిక్రమ్ మార్క్ ఫ్లో మిస్ అయ్యింది. డైలాగ్స్ లో స్పీడ్ నెస్ లేదు, అంత పవర్ ఫుల్ డైలాగ్ ఎక్కడా కనిపించలేదు అంటే మనసుకు టచ్ చేసే డైలాగ్ లేదు.. ఏదో అల్లు అర్జున్ మ్యానరిజంతో త్రివిక్రమ్ డైలాగ్స్ పేలాయి కానీ.. లేదంటే గురూజీ స్టయిల్ మిస్ అయిన భావన కలిగేది. అయితే అరవింద్ సమేత తో ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ కి మంచి అనుబంధం ఏర్పడడమే కాదు.. ఎన్టీఆర్ అయితే త్రివిక్రమ్‌ని ఏకంగా స్వామి అంటూ సంబోధించడం మొదలెట్టాడు. అల వైకుంఠపురములో హిట్ అయ్యాక ఎన్టీఆర్ అల్లు అర్జున్ ని బావ.. త్రివిక్రమ్ ని స్వామి అంటూ సంబోధించడం సంచలనం అయ్యింది.
అయితే ఎన్టీఆర్ అరవింద సమేత మాస్ ఎంటెర్టైనెర్ తర్వాత RRR చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మోస్ట్లీ త్రివిక్రమ్‌తోనే ఎన్టీఆర్ మూవీ. అయితే త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలనుకుంటున్నాడు. రెండు మాస్ ఫిలిమ్స్ తర్వాత ఎన్టీఆర్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటెర్టైనర్‌ని త్రివిక్రంతో చేస్తాడని అంటున్నారు. అయితే త్రివిక్రమ్ ఎప్పటిలా కాకుండా ఎన్టీఆర్ కోసం కొత్త కథని, కామెడీ పంచ్ లను ప్రిపేర్ చేసుకోవాలని ఎన్టీఆర్ అభిమానుల కోరిక. అందుకే ఎన్టీఆర్ కోసమైనా మారు స్వామి అంటూ త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. మరి ఫ్యామిలీ అంటే ఒకే మూసలో వెళుతున్న త్రివిక్రమ్ మళ్ళీ అత్తారింటికి, అజ్ఞాతవాసి, అల సినిమాల్లాంటి సినిమా తీస్తే ఈసారి వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి.. కొత్తగా ఎన్టీఆర్ కోసం ఆలోచించడమే బెటర్.