మెహ్రీన్ కౌర్ యంగ్ హీరోలతో ఎలాగోలా తిప్పలు పడుతూ సినిమాలు చేస్తుంది. హిట్స్ తగిలినా కూడా మెహ్రీన్ కి స్టార్ అవకాశాలు రావడం లేదు. అందుకే వచ్చిన అవకాశాలతో సర్దుకుపోతున్న మెహ్రీన్ ఇప్పుడు ఎంత మంచివాడవురా అంటూ తెలుగులో యావరేజ్ హిట్ కొట్టగా... తమిళనాట మాత్రం పటాస్ సినిమాతో హిట్ కొట్టింది. ధనుష్ సరసన తమిళనాట పటాస్ సినిమాలో నటించిన ఆ సినిమాతో తమిళంలోనూ హిట్ కొట్టింది. ప్రస్తుతం తెలుగులో నాగశౌర్యతో అశ్వద్ధామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెహ్రీన్ కౌర్ పై ఇప్పుడో న్యూస్ టాలీవుడ్ హాట్ టాపిక్ అయ్యింది.
అదేమిటంటే మెహ్రీన్ కౌర్ నిర్మాతలను ముప్పతిప్పలు పెడుతుందనే న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎంత మంచివాడవురా సినిమా నిర్మాతలను మెహ్రీన్ బాగా ఇబ్బంది పెట్టింది అని.. నిర్మాతల నుండి ఎంతగా రాబట్టాలో అంతగా రాబట్టింది అని.. అంతేకాకుండా పర్సనల్ విషయాల కోసము నిర్మాతలను ముప్పతిప్పలు పెట్టిందట. హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఇంత ఫిక్స్ చేసినా.. షూటింగ్ సమయంలో హీరోయిన్స్ పర్సనల్ ఖర్చులు కూడా నిర్మాతల అకౌంట్ లోనే పడుతుంది. అదే అదనుగా మెహ్రీన్ కౌర్ హోటల్ లో ఫుడ్ దగ్గరనుండి.. లాండ్రీ ఖర్చు, తనతో వచ్చిన పేరెంట్స్ ఖర్చులను కూడా నిర్మాతలకు బిల్లులు పంపి లక్షలు గుంజింది అనే న్యూస్ నడుస్తుంది. ఆ విషయంలో ఎంత మంచివాడవురా నిర్మాతకి మెహ్రీన్ కి మధ్యలో చిన్న గొడవ కూడా జరిగినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇలా అయితే మెహ్రీన్ కౌర్ ని సినిమాల్లోకి తీసుకునే విషయంలో నిర్మాతల ఆలోచన మారినా మారొచ్చు అంటున్నారు. ఎందుకంటే ఓ అన్నంత హిట్స్ లేని మెహ్రీన్ ని పక్కన బెట్టడం ఎంత పని.