బాలీవుడ్ లో పడుతూ లేస్తున్న పూజాహెగ్డేకి టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచేసింది. డీజే సినిమాతో లక్కును తొక్కిన పూజాహెగ్డే నిన్నటి అల వైకుంఠపురములో వరకు.. సినిమాల మీద సినిమాలు చేస్తూ పిచ్చెక్కిస్తుంది. నిన్నటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ పడకపోయినా.. పూజా క్రేజ్ పీక్స్ లో ఉంది. మరి అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తో పూజా క్రేజ్ మరింతగా ఆకాశాన్ని తాకింది. ఇప్పటికే పూజా స్టార్ హీరోలను చుట్టేస్తూ యంగ్ హీరోలతోనూ అదరగొట్టేస్తుంది. అరవింద సమేత యావరేజ్ అయినా వాల్మికీలో పూజాహెగ్డే ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ కావడం, అల వైకుంఠపురముతో మళ్ళీ బ్లాక్ కస్టర్ కొట్టడంతో పూజాహెగ్డే క్రేజ్ పీక్స్ కి వెళ్ళింది.
ఇక బాలీవుడ్ లోను హౌస్ ఫుల్ 4 యావరేజ్ టాక్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. దానితో పూజాహెగ్డేకి అక్కడ కూడా క్రేజ్ మొదలయ్యింది. మోహింజదారో తర్వాత పూజాహెగ్డేకి అవకాశాలు ఇవ్వాలంటే భయపడిన బాలీవుడ్ దర్శకనిర్మాతలు.. ఇప్పుడు ఆమె లక్కుని వాడుకోవాలని డిసైడ్ అయ్యారు. హౌస్ ఫుల్ 4 తరవాత పూజాహెగ్డేకి మరోసారి అక్షయ్ కుమార్ తన కొత్త సినిమాలో సెకండ్ హీరోయిన్ అవకాశం ఇచ్చాడనే టాక్ అందుతుంది. మరి ప్రస్తుతం బాలీవుడ్ లో వరస విజయాల మీదున్న ఏకైక హీరో అక్షయ్ కుమార్. అలాంటి అక్షయ్ మళ్ళీ పిలిచి అవకాశం ఇవ్వడంతో పూజాహెగ్డే లక్కుని తొక్కిందంటున్నారు. మొదటి హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ పాత్రలో ఈ పూజాహెగ్డే నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. సెకండ్ అయినా పర్లేదు.. హిట్ హీరో కదా అని పూజా కూడా మారు మాట్లాడకుండా అక్షయ్ తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.