Advertisementt

‘డిస్కోరాజా’ ఫుల్ మీల్స్‌లా ఉండబోతోందంట!

Sat 18th Jan 2020 07:55 PM
disco raja,3rd song launch,raviteja,nabha natesh,sunil,vi anand  ‘డిస్కోరాజా’ ఫుల్ మీల్స్‌లా ఉండబోతోందంట!
Disco Raja 3rd Song Launch Event details ‘డిస్కోరాజా’ ఫుల్ మీల్స్‌లా ఉండబోతోందంట!
Advertisement
Ads by CJ

మాస్ మహారాజా రవితేజ డిస్కోరాజా నుంచి మూడో పాట రమ్ పమ్ బమ్ విడుదల

మాస్ మహారాజా ర‌వితేజ హీరోగా.. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న డిస్కో రాజా సినిమాని రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నభా నటేశ్,  పాయల్‌ రాజ్‌పుత్‌, తాన్యా హోప్ ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని మూడో పాట హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశంలో విడుదల అయ్యింది. ఈ కార్యక్రమంలో వి.ఐ. ఆనంద్, సునీల్, నభా నటేష్, తమన్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు విఐ. ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘డిస్కో రాజా అనే సినిమా ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని ఇస్తుంది. రవితేజగారి క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. తమన్ అందించిన సాంగ్స్ ఈ మధ్య పాపులర్ అయ్యాయి, అలాగే మా సినిమా కోసం తమన్ మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చాడు. రమ్ పమ్ బమ్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది’’ అన్నారు.

తమన్ మాట్లాడుతూ.. రమ్ పమ్ బమ్ సాంగ్ చేస్తున్నప్పుడు ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను, ఇప్పుడు సాంగ్‌తో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, గుడ్ రెస్పాన్స్ లభిస్తోంది, ఇదంతా చూస్తుంటే కష్టం మర్చిపోయాను. డిస్కో రాజా సినిమాకు మంచి పాటలు చేసే అవకాశం లభించింది. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన ఢిల్లీవాలా, నువ్వు నాతో సాంగ్స్‌‌కు మంచి రెస్పాన్స్ లభించిందన్నారు.

సునీల్ మాట్లాడుతూ.. రవితేజగారితో నేను కొంత గ్యాప్ తరువాత చేసిన సినిమా ఇది. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనంద్ గారు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తీశాడు, ఆడియన్స్‌కు ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ మూవీలా ఉంటుంది.. అన్నారు.

నభా నటేష్  మాట్లాడుతూ.. రవితేజగారితో వర్క్ చెయ్యడం మర్చిపోలేని అనుభూతి, ఈ సినిమాలో నా పాత్ర పేరు నభా, మీ అందరికీ నచ్చుతుంది. ఢిల్లీ వాలా సాంగ్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సాంగ్‌లో నా డ్యాన్స్ మూమెంట్స్ బాగుంటాయి. జనవరి 24న విడుదల కానున్న డిస్కో రాజా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చెయ్యాలని కోరారు.

Disco Raja 3rd Song Launch Event details:

Celebrities Speech at Disco Raja 3rd Song Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ