గత గురువారం తెలుగు, తమిళంలో విడుదలైన రజినీకాంత్ దర్బార్ సినిమాని తెలుగులో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు చెక్ పెట్టినప్పటికీ...తమిళనాట మాత్రం దర్బార్ సినిమా సూపర్ హిట్ కలెక్షన్స్‌తో దూసుకుపోయింది. రజినీకాంత్ క్రేజ్, మురుగదాస్ స్టయిల్ అన్ని దర్బార్ సినిమాని నిలబెట్టాయి. లేదంటే యావరేజ్ టాక్ తో దర్బార్ సినిమాకి ఇబ్బంది అయ్యేది. అయితే తెలుగులో రెండు రోజులకే సర్దుకున్న దర్బార్‌కి తమిళంలో మాత్రం ఆరో రోజున రజినీకాంత్ అల్లుడు ధనుష్ తన కొత్త సినిమా పటాస్‌తో చెక్ పెట్టాడు.
మామని వారం ఫ్రీగా వదిలేసి పొంగల్ రోజున ధనుష్ మాస్ ఎంటెర్టైనెర్ పటాస్‌ని విడుదల చేసాడు. ఆ సినిమాకి హిట్ టాక్ రావడంతో రజనీకాంత్ దర్బార్ వసూళ్లు పడిపోయాయి. మామ క్రేజ్ ముందు ధనుష్ క్రేజ్ తక్కువే అయినా ధనుష్ మాస్ క్రేజ్ ముందు ఇప్పుడు రజినీకాంత్ తలవంచక తప్పప్లేదు. పటాస్ విడుదలైన రోజునే ఆ సినిమా కున్న క్రేజ్‌తో దర్బార్‌ని పక్కనబెట్టిన ప్రేక్షకులు ధనుష్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు అంటే.. ధనుష్ మాస్ క్రేజ్ ఎలా ఉందో అర్ధమవుతుంది.
ధనుష్ గత సినిమా అసురన్ హిట్ కావడంతో పటాస్ పై భారీ అంచనాలు రావడంతో ప్రేక్షకులు రజిని దర్బార్‌ని లైట్ తీసుకుని పటాస్ ని హిట్ చేసారు. మొదటి రోజు ధనుష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన పటాస్‌కి రెండో రోజు టాక్ బావుండడంతో.. కలెక్షన్స్ మోత మోగిస్తుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ధనుష్ ద్విపాత్రాభినయం చేసాడు. మరి అలా మామని దెబ్బకొట్టిన అల్లుడిగా ధనుష్ నిలిచాడన్నమాట.