Advertisementt

నితిన్‌కు లవ్ మ్యారేజ్.. డేట్ ఫిక్స్..!!

Thu 16th Jan 2020 08:05 PM
nithin,love marriage,date place fix,tollywood  నితిన్‌కు లవ్ మ్యారేజ్.. డేట్ ఫిక్స్..!!
Nithin Love Marriage Date.. Place Fix.. Details Here..!! నితిన్‌కు లవ్ మ్యారేజ్.. డేట్ ఫిక్స్..!!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో చాలా మంది మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్స్ ఉన్నారన్న విషయం తెలిసిందే. వారిలో కుర్ర హీరో నితిన్ కూడా ఒకరు. అయితే అప్పుడెప్పుడో ‘శ్రీనివాస కల్యాణం’ సినిమా టైమ్‌లోనే త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పిన నితిన్.. అది కాస్త రెండు మూడు సినిమాలు అయ్యాక ముహూర్తం కుదిరిందట. అంతేకాదు.. ఈ పెళ్లి లవ్ అండ్ అరేంజ్డ్ కావడంతో నితిన్ ఆనందానికి అవధుల్లేవట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్-16న పెళ్లి చేసుకోబోతున్నాడని టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వార్తలు వినపడుతున్నాయి.

కాగా.. ఈ పెళ్లికి దుబాయ్‌లోని ప్యాలసో వెర్సేస్‌ హోటల్‌ వేదిక కానుందట. ఇప్పటికే ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారట. నితిన్‌-శాలినితో 2005లో లవ్‌లో పడ్డాడని.. నాటి నుంచి వీరి లవ్ ట్రాక్ నడుస్తూనే ఉందని.. ఇప్పుడు అది కాస్త పెళ్లి పీఠలెక్కబోతోందని కుర్ర హీరోకు చెందిన సన్నిహితులు మీడియాకు లీకులు అందించారట. ఇదిలా ఉంటే.. శాలిని లండన్‌లో ఎంబీఏ పూరన్తి చేసిందని తెలుస్తోంది.

దుబాయ్‌లో అత్యంత సన్నిహితుల మధ్యే పెళ్లి చేసకొని.. హైదరాబాద్‌లో మాత్రం గ్రాండ్‌గా రిసెప్షన్ పెట్టుకోవాలని ఇరు కుటుంబాలు భావించాయట. వాస్తవానికి ఇప్పుడు పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కోసం సెలబ్రిటీలందరూ దుబాయ్ బాట పడుతున్నారు. అందుకే నితిన్ కూడా అక్కడే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట. రెండ్రోజులుగా ఇందుకు సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో.. టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయ్.. మరోవైపు నితిన్ కూడా స్పందిచకపోవడంతో మౌనానికి అర్థం అంగీకారమనేనని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

Nithin Love Marriage Date.. Place Fix.. Details Here..!!:

Nithin Love Marriage Date.. Place Fix.. Details Here..!!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ