చిరంజీవి - కొరటాల కాంబోలో సినిమా ఈ నెలాఖరు నుండి పట్టాలెక్కబోతుంది. భారీ అంచనాల నడుమ మొదలవుతున్న ఈ సినిమాని 95 రోజుల్లో పూర్తి చెయ్యాలంటూ.. చిరు సరదాగా కొరటాలకు ఓ ఈవెంట్ లో స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మొదటినుండి రామ్ చరణ్ నటిస్తాడనే ప్రచారం ఉంది. ఇక తాజాగా చరణ్, కొరటాల - చిరు సినిమా కోసం 40 రోజుల్ కాల్షీట్స్ ఇచ్చాడనే న్యూస్ నడుస్తుంది. ఆ 40 రోజుల్లో కొరటాల శివ, చిరు యంగ్ పాత్రలో చరణ్ చూపించబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతుంది.
అయితే యంగ్ చిరుగా చరణ్ 20 నిమిషాల పాటు సినిమాలో కనిపిస్తాడని.. అయితే యంగ్ కేరెక్టర్ లోనే చిరుకి లవర్ ఉంటుందట. మరా యంగ్ చిరు పాత్రధారి చరణ్ సరసన ఓ హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తుందని.. ఆ పాత్రకి కొరటాల శివ, కియారా అద్వానీ పేరు పరిశీలిస్తున్నాడనే టాక్ మొదలైంది. వినయ విధేయరామతో డిజాస్టర్ కొట్టినా.. బాలీవుడ్ లో మాత్రం కియారా అద్వానీ చెలరేగిపోతుంది కాబట్టి.. ఆ క్రేజ్ ఇక్కడ చిరు సినిమాకి పనికొస్తుందని.. ఎలాగూ చెర్రీ - కియారాలు దోస్త్ లు గనక కియారా, చరణ్ తో నటించడానికి ఒప్పుకుంటుందని అంటున్నారు. ఇక చిరు సరసన అయితే త్రిష ఫైనల్ అంటున్నారు కానీ... చిత్ర బృందం నుండి క్లారిటీ రావడం లేదు.