తెలుగులో టాప్ హీరోస్ దగ్గరనుండి.. చిన్న, యంగ్ హీరోలతో సినిమాలు చేసిన రకుల్ ప్రస్తుతం అయితే తెలుగులో ఛాన్సెస్ లేవు. అయితే అమ్మడు ఎప్పుడూ జిమ్ వర్కౌట్స్, హాలిడే ట్రిప్స్ అంటూ బాగా ఎంజాయ్ చెయ్యడమే కాదు.. బిజినెస్ లోను దూసుకుపోతుంది. అయితే ఎప్పుడో ఇండస్ట్రీలోకొచ్చిన రకుల్ ఇంకా పెళ్లి చేసుకోలేదు, ప్రేమించనూలేదు. కాకపోతే ప్రేమ గురించి బోలెడంత తెలుసుకుందట. ఇప్పటివరకు ఎవరితోనూ ప్రేమలో పడలేదు కానీ.. ప్రేమంటే చాలా లోతైన విషయమని దాని గురించి చాలా తెలుసుకున్నా అంటుంది ఈ చిన్నది.
ప్రతి సినిమా కథ ప్రేమలోని గొప్పదనాన్ని తెలియజేస్తుంది. తెలియని కోణాన్ని తెలియజేస్తుంది. అయితే సినిమా రంగంలో ఉన్నందువల్లే తాను ప్రేమ గురించి ఇన్ని విషయాలు తెలుకున్నా అని... సినిమా రంగంలోకి రాకపోయుంటే.. తనకు ప్రేమ గురించి ఇంత బాగా తెలిసేది కాదని, ప్రేమ ఒక్కటే కాదు... సినిమాల వలన ఇంకా చాలా నేర్చుకున్న అని చెబుతుంది. మరి సినిమాల వలన రకుల్ జీవితాన్ని చదివేసింది అనిపిస్తుంది కదా.