పూజా హెగ్డే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బాగా బిజీగా వుంది. మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా ఏ ఒక్క హీరోని వదలకుండా పూజా హెగ్డే టాలీవుడ్‌లో నెంబర్ వన్ పొజిషన్‌కి వచ్చేసింది. అయితే డీజే దగ్గరనుండి పూజా హెగ్డే భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలే చేస్తుంది కానీ... అమ్మడుకు అదిరిపోయే బ్లాక్ బస్టర్ మాత్రం ఇంతవరకు తగల్లేదనే చెప్పాలి. అల్లు అర్జున్ డీజే హిట్ అన్నారు కానీ.. బ్లాక్‌బస్టర్ పడలేదు. ఇక మహేష్ మహర్షి కూడా సూపర్ హిట్ అన్నారు. కానీ బ్రేక్ ఈవెన్ సాధించడానికి నానా తిప్పలు పడింది. ఎన్టీఆర్ అరవింద సమేత కూడా సేమ్ టు సేమ్. మరి అన్ని సినిమాల్లో పూజ హెగ్డే పాత్రకి మంచి పేరొచ్చింది. ఎందుకంటే పూజా హెగ్డే గ్లామర్ తోనూ, డాన్స్ లతోను హైలెట్ అవుతూ వచ్చింది.
అయితే తాజాగా అల్లు అర్జున్ తో అమ్మడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్లే కనబడుతుంది. అల వైకుంఠపురములో నిన్న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులే కాదు, రివ్యూ రైటర్స్ కూడా అల వైకుంఠపురములో సినిమాకి హిట్ టాక్ ఇచ్చేసారు. అయితే ఈసినిమాలో పూజా హెగ్డే ముందు నుండి చెప్పుకున్నట్టుగా గ్లామర్ డాల్ గా అదరగొట్టేసింది. కానీ ఆమె పాత్రని త్రివిక్రమ్ గట్టిగా డిజైన్ చెయ్యలేదనిపించింది. కేవలం గ్లామర్ కోసమే పూజాని తీసుకున్నాడనిపిస్తుంది. అయితే పూజా హెగ్డే అందంతో ఆకట్టుకుంది. మొదట్లో ఆమె పాత్ర బాగానే అనిపించినా తర్వాత తేలిపోయింది. నటన పరంగా ఆమెకి పెద్దగా అవకాశం లభించలేదు. కానీ సినిమా హిట్ టాక్‌తో పూజా హెగ్డే కి మాత్రం సంతోషం కలిగించే విషయం. మరి పూజా గ్లామర్ డాల్ అనే ముద్రతో మరిన్ని అవకాశాలు పట్టెయ్యడం ఖాయమే. ఇప్పటికే అఖిల్, ప్రభాస్ సినిమాల్లో నటిస్తుంది పూజా.