సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ కా బాప్ అనే టాక్‌తో తొలి రోజున వరల్డ్ వైడ్‌గా రూ. 46.77 కోట్లరూపాయల షేర్‌ను సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్‌ను సాధిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్‌లో....
చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకు పనిచేసిన టీమ్‌కి ధన్యవాదాలు. రత్నవేలుగారికి థాంక్యూ. ఆయన అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. కాశ్మీర్ ఎపిసోడ్, కర్నూల్ ఎపిసోడ్, విజయశాంతి - హీరో మధ్య ఉండే ఎపిసోడ్స్ అన్నిటిలోనూ చాలా బాగా విజువల్స్ ఇచ్చారు. ప్రకాష్ గారు అద్భుతమైన సెట్స్ వేశారు. ఎడిటర్ తమ్మిరాజు నాతో ఉండి సపోర్ట్ చేశారు. నా మెయిన్ రైటింగ్ టీమ్ కృష్ణ రెండు ఏరియాలు కొనుక్కుని గుంటూరు, వెస్ట్ మొత్తం తిరుగుతున్నారు. నా డైరక్షన్ డిపార్ట్ మెంట్‌కి థాంక్స్. రామ్-లక్ష్మణ్ మాస్టర్లకు ధన్యవాదాలు. అనిల్ సుంకరగారికి థాంక్స్. ఆయన నన్ను ఎక్కడా టెన్షన్ పెట్టలేదు. రాజుగారితో నా జర్నీ కొనసాగుతూ ఉంది. ఆయనకు చాలా థాంక్స్. దేవిశ్రీ ప్రసాద్‌గారికి ధన్యవాదాలు. ఆయన అద్భుతమైన పాటలిచ్చారు. రీరికార్డింగ్ బావుంది. సంగీతగారి కమ్‌బ్యాక్ బావుంది. రష్మిక మేనరిజమ్స్ బావున్నాయి. కౌముది, పల్లవి చాలా బాగా చేశారు. రాజేంద్రప్రసాద్‌గారికి, ప్రకాష్‌రాజ్‌గారికి థాంక్స్. విజయశాంతిగారు ఈ పాత్రను అవలీలగా చేశారు. ఆవిడ ఎక్స్ పీరియన్స్ అందుకు ప్రధాన కారణం. ఆవిడకి ధన్యవాదాలు. ఆమె పాత్రకు ఆమె తప్ప ఇంకెవ్వరూ రీప్లేస్ చేయలేరు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీన్లు చాలా బావున్నాయి. ఈ సినిమాలో మీ వేల్యూ ఏంటో నెక్స్ట్ వీక్ కూడా తెలుస్తుంది. ఆమెను అభిమానించే వాళ్లు నెక్స్ట్ వీక్ కూడా థియేటర్లకు వెళ్తారు. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ కా బాప్ అని ట్యాగ్‌లైన్ పెట్టాం. సినిమా హిట్టును బట్టి, దానికి ఓ ట్యాగ్‌ను అటాచ్ చేస్తారు ఏ సినిమా వాళ్లైనా. మా సినిమాకు బ్లాక్ బస్టర్ కా బాప్ అని పెట్టారు. ఎందుకు పెట్టామంటే... ఈ సినిమాకు నిన్నటి నుంచీ బొమ్మ దద్దరిల్లిపోయింది అని అంటున్నారు. సినిమా ఓపెనింగ్ విజయశాంతిగారి పాత్ర, పేట్రియాటిజమ్, ట్రయిన్ ఎపిసోడ్, యాక్షన్.. సెకండాఫ్‌లో హీరోగారికి, విజయశాంతిగారికి మధ్య వచ్చే డైలాగులు, ప్రకాష్‌రాజ్‌గారి సీన్లు, హీరోగారు మాట్లాడే పొలిటికల్ విషయాలు, ఆ తర్వాత విజయశాంతిగారికీ - హీరోగారికీ మధ్య వచ్చే సీన్లు.. ఇలా ప్రతి పార్టు గురించీ ట్యాగ్ చేసి చెబుతున్నారు. దాంతో ఎంత కనెక్ట్ అయ్యారో అర్థమైంది కాబట్టి బ్లాక్ బస్టర్ కా బాప్ అని పెట్టాం. బాహుబలిలో శివుడిని తీసుకెళ్లినట్టు నన్ను ప్రజలు తీసుకెళ్తుంటారు. ఈ మూవీలో మహేష్ గారు కూడా ఉన్నారు. ఈ సినిమాను ఎక్కడ తీసుకెళ్లి కూర్చోబెడుతారో వచ్చే వారం తెలుస్తుంది. ఈ చిత్రంలో అజయ్ చాలా మంచి పాత్ర చేశారు. నేను కూడా ఎగ్జయిట్ అయిన విషయం ఈ చిత్రంలోని అల్లూరి సీతారామరాజు పాత్ర. ఆ పాత్రను అనుకుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. హీరోగారు అడుగు పెట్టినప్పుడల్లా అజయ్ సీతారామరాజు అని అంటుంటే, దానికి దేవిశ్రీ ప్రసాద్ రీరికార్డింగ్ తోడై గూస్ బంప్స్ వచ్చాయి. అల్లూరి సీతారామరాజు ఎపిసోడ్ రావడానికి కారణం రామ్-లక్ష్మణ్. నేను కథ చెప్పినప్పుడు ఇంట్రవెల్‌లో ఫోర్సు కావాలా4 అని అన్నారు. వాళ్ల వల్లే రెండు రోజులు ఆలోచించి ఇది పెట్టాం. వాళ్ల జడ్జిమెంట్‌కీ, ఎక్స్ పీరియన్స్ కీ చాలా థాంక్స్. ఈ సినిమా సోల్‌ని ఆర్మీ బేస్‌లో చేశాం. ఇవాళ మధ్యాహ్నం ఒకమ్మాయి మెసేజ్ చేశారు. వాళ్ల ఫాదర్ ఆర్మీ లో పనిచేస్తారని అన్నప్పుడు ఆనందంగా అనిపించింది. మనకోసం కాపలా కాసే సోల్జర్లు.. మనం బాధ్యతగా ఉండాలని కోరుకుంటారని హీరోగారితో చెప్పించాం. ఆ కంటెంట్ కూడా జనాల్లోకి రీచ్ అయింది. మహేశ్‌గారి గురించి ఎంత చెప్పిన తక్కువే. సినిమా జర్నీ అంత ఒక ఎత్తు.. సినిమా మార్నింగ్ షో తర్వాత నేను పొందిన అనుభూతి వేరు. ప్రేక్షకుల నుండి వస్తోన్న స్పందన చూస్తుంటే నేనేనా ఈ సినిమాను తీసింది అనే ఫీలింగ్ కలిగింది. నాకు డైరెక్షన్ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్. సినిమాకు వచ్చిన ప్రేక్షకులు మంచి ఫన్, మెమొరీస్ తీసుకెళ్తారు. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు.
దేవిశ్రీ మాట్లాడుతూ.. ‘‘మనకు ఓ సినిమాకు మంచి పేరు రావాలంటే అవకాశం చాలా ముఖ్యం. అవకాశం వచ్చినప్పుడే టాలెంట్ మనం చూపించుకోగలం. అలా ఇప్పటిదాకా అవకాశం రూపంలో నాకు వచ్చిన ప్రతి సినిమాకు థాంక్స్. అలాంటి అద్భుతమైన సినిమాకు స్క్రిప్ట్ రాసి డైరక్ట్ చేసిన అనిల్ రావిపూడిగారికి, ఈ సినిమాలో నటించిన మహేష్ గారికి, నాతో 12 సినిమాల అనుబంధం ఉన్న దిల్‌రాజుగారికి, అనిల్ సుంకరగారికి ధన్యవాదాలు. దిల్‌రాజుగారిలాగా అనిల్ సుంకర కూడా స్వీటెస్ట్ ప్రొడ్యూసర్. మేం అన్ని పాటలు రెడీ చేస్తుండగా, యు.ఎస్.కివెళ్లి యాంథమ్ చేద్దామని అనగానే అనిల్ సుంకరగారు ఎంతో ఎంకరేజ్ చేశారు. మా టీమ్‌కి ధన్యవాదాలు. వాళ్లందరూ నాతో ఉండి నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. ప్రతి మండే ప్రతి సాంగ్‌నీ జనాలకు చేరవేసిన మీడియాకు థాంక్స్. అనిల్ రావిపూడికి ధన్యవాదాలు. ఎఫ్2 చేసినప్పుడు అనిల్‌ని చూశాను. ఆయన కథ చెప్పినప్పుడు సినిమా చూసినట్టు అనిపిస్తుంది. నేను కథను విన్నప్పుడు ఎంత థ్రిల్ అయ్యానో, సినిమా చూసినప్పుడు కూడా అలాగే భావించాను. రష్మిక మంచి జాబ్ చేసింది. ఆమె పెర్ఫార్మెన్స్ గీత గోవిందంలో నచ్చింది. ఈ సినిమాలో కామెడీ చేసి డబ్బింగ్ చెప్పడం బావుంది. సంగీతగారికి బ్యూటీఫుల్ రీ ఎంట్రీ. ఆమె మ్యానరిజమ్ చాలా బావుంది. కౌముది అందరూ బాగా చేశారు. రామ్‌లక్ష్మణ్‌గారి ఫైట్స్ బాగా ఇన్‌స్పయిరింగ్‌గా అనిపించాయి. రీరికార్డింగ్ చాలా బాగా వచ్చిన ప్రతిసారీ ఎప్పుడూ డైరక్టర్‌కి, హీరోకి క్రెడిట్ ఇవ్వాల్సిందే. రీరికార్డింగ్‌ని దేవీ బాగా చేస్తాడనే నమ్మకం మహేష్గారికి ఎప్పుడూ ఉంటుంది. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలన్న తపన నాకు రెట్టింపుగా ఉంటుంది. ఆయనకు ఎన్ని థాంక్స్ లు చెప్పినా తక్కువే. ఆయనమీద నాకున్న గ్రాట్యుట్యూడ్‌కి అక్షరరూపం ఇవ్వలేను. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ కా బాప్‌గా చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా నాన్నగారితో పనిచేశారు విజయశాంతిగారు. నాకు శత్రువు ఫేవరేట్ సినిమా. ఆమె సినిమాలను తమిళ్‌లోనూ చూసేవాడిని..’’ అని చెప్పారు.
రష్మిక మాట్లాడుతూ.. ‘‘స్క్రీన్ మీద ఆడియన్స్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వాలనే సంగతి నేను నటిని అయ్యాక తెలుసుకున్నా. మహేష్ గారి కామెడీ టైమింగ్, డ్యాన్సులు ఈ సినిమాలో సర్‌ప్రైజ్. ఆయన్ని స్క్రీన్ మీద చూడటం ట్రీట్. నా ఏడేళ్ల చెల్లెలు మహేష్ గారిని చూడాలని అడుగుతోంది. విజయ మేడమ్ కేరక్టర్ చాలా స్ట్రాంగ్. చాలా అందగత్తె. దేవిశ్రీ ప్రసాద్‌గారి సంగీతం చాలా బావుంది. నా డ్యాన్సులను ఈ సినిమాలో తొలిసారి చూశారు. అనిల్‌గారికి, దిల్‌రాజుగారికి పండగ స్టార్ట్ అయింది. ఈ టీమ్‌తో పనిచేయడం చాలా బావుంది. సంస్కృతి పాత్రలో బాగా చేశానని అనుకుంటున్నా. నాకు ఆ కేరక్టర్‌కు కావాల్సిన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ తెలియదు. అన్నీ డైరక్టర్ నేర్పించారు. నేను ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా అమ్మకు బాగా కనెక్ట్ అయింది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అజయ్, తమ్మిరాజు, యుగంధర్, చిట్టి, కౌముది తదితరులు పాల్గొన్నారు.