Advertisementt

చిరుకు ‘సరిలేరు’ సినిమా నచ్చలేదా.. అందుకే..!?

Mon 13th Jan 2020 09:37 PM
chiru phone call,mahesh babu,megastar chiranjeevi,sarileru neekevvaru  చిరుకు ‘సరిలేరు’ సినిమా నచ్చలేదా.. అందుకే..!?
News About Chiru Phone Call To Mahesh చిరుకు ‘సరిలేరు’ సినిమా నచ్చలేదా.. అందుకే..!?
Advertisement
Ads by CJ

‘మన దగ్గర బేరాల్లేవమ్మా.. బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’తో సంక్రాంతి బరిలోకి దిగిన మహేశ్ నిజంగానే అనుకున్నట్లుగా ‘సరిలేరు నాకెవ్వరూ’ అని అనిపించుకున్నాడు. నిజంగానే బొమ్మ మాత్రం దద్దరిల్లిపోయింది. కామెడీ, యాక్షన్ ఇలా అన్ని కోణాలనూ సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి చూపించాడు. ప్రతి సినిమాకు మొదట మెగాస్టార్ చిరంజీవి నుంచి ఫోన్ కాల్ వస్తుందన్న విషయాన్ని మహేశ్ బాబే స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే ప్రి రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చిన మెగాస్టార్.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఇటీవలే వీక్షించారట. అయితే సినిమా ఎలా ఉంది..? మహేశ్ పాత్ర ఎలా ఉంది..? అందరూ అంటున్నట్లుగా బొమ్మ అదిరిందా..? లేదా..? అని ఏదో ఒక విషయాన్ని ఇప్పటికీ.. ఫోన్ కాల్ చేసి చెప్పలేదట. చిరుకు సినిమా నచ్చలేదని అందుకే కాల్ చేయలేదని క్రిటిక్స్, మహేశ్‌ను వ్యతిరేకించి కొందరు హీరోల వీరాభిమానులు నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. 

కాగా.. ఇటీవల జరిగిన సరిలేరు ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చిరు-మహేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సరిలేరు విషయంలో మెగాస్టార్ నుంచి ఫోన్ కాల్ వెయిట్ చేస్తుంటానని మహేశ్ చెప్పాడు. మరి కనీసం మాట మాత్రమైనా మెగాస్టార్ ఫోన్ చేశాడా లేదా..? లేదా అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే మరోవైపు థ్యాంక్యూ మీట్ అంటూ సరిలేరు చిత్రబృందం దూసుకెళ్తోంది. చిరు నుంచి ఫోన్ రాలేదన్న విషయంలో నిజమెంత..? ఒక వేళ నిజంగా ఫోన్ కాల్ వచ్చుంటే మహేశ్ సోషల్ మీడియాలో ఎందుకు స్పందించలేదు..? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సూపర్‌స్టార్ రియాక్ట్ అవ్వాల్సిందే మరి.

News About Chiru Phone Call To Mahesh:

News About Chiru Phone Call To Mahesh  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ