స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’. శనివారం నాడు (జనవరి-12) విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా చూసిన వీరాభిమానులు, సెలబ్రిటీలు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా బన్నీతో మంచి సన్నిహిత సంబంధాలున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అయితే.. జూనియర్ ట్వీట్‌కు బన్నీ రియాక్ట్ అయ్యాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణేంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
జూనియర్: ‘అల్లు అర్జున్ నటన అద్భుతం. త్రివిక్రమ్ గారు అద్భుతంగా సినిమాను రాసుకున్నారు. అల వైకుంఠపురములో సినిమా చాలా బావుంది. కంగ్రాట్స్ బావా.. స్వామి. మురళీ శర్మ గారి ఫెర్ఫామెన్స్ చాలా బాగుంది. థమన్ అందించిన సంగీతం సినిమాకు ఓ పెద్ద ప్లస్ పాయింట్. హారిక అండ్ హాసిని నిర్మాణ విలువలు బావుతున్నాయి. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్’ అంటూ ఎన్టీఆర్ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.
బన్నీ రిప్లై: ‘బావా థ్యాంక్యు వెరీ మచ్. మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది.. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను’ అని రిప్లయ్ ఇచ్చాడు బన్నీ.
కాగా.. బన్నీ ఒక్కడే కాదు ఇండస్ట్రీలో అందరితోనూ జూనియర్ చాలా కలివిడిగా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఏ సినిమా అయినా సరే తాను చూస్తే కచ్చితంగా అందుకు సంబంధించి ట్వీట్స్ చేయడం.. వారిని మెచ్చుకోవడం బుడ్డోడికి కొత్తేమీ కాదు. వీరిద్దరి సంభాషణతో నందమూరి వీరాభిమానులు, మెగాభిమానులు మరీ ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ ఆనందలో మునిగితేలుతూ ఈ ట్వీట్స్‌ను లైక్ చేస్తూ పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటున్నారు. మరి ఈ ఇద్దరి కలయిక ఎప్పుడు ఉంటుందా అని ఇరువురి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. మరి కలయిక ఎప్పుడో ఏంటో..!