Advertisementt

నితిన్.. ‘భీష్మ’ టీజర్ విడుదల

Mon 13th Jan 2020 12:34 AM
bheeshma,bheeshma teaser,nithiin,venky kudumula,rashmika mandanna  నితిన్.. ‘భీష్మ’ టీజర్ విడుదల
Nithiin Bheeshma Teaser Released నితిన్.. ‘భీష్మ’ టీజర్ విడుదల
Advertisement
Ads by CJ

నితిన్, రష్మిక మందన్న, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్ర టీజర్ ఈరోజు (ఆదివారం) ఉదయం విడుదలైంది.

చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ... ఈ చిత్ర టీజర్‌ను ఈరోజు విడుదల చేయటం జరిగింది. పూర్తి స్థాయి వినోద ప్రధానంగా ఈ చిత్రం ఉంటుంది అనటానికి ఈ టీజర్ ఒక శాంపిల్ మాత్రమే. దానికి తగినట్లుగానే చిత్రం కథ, కథనాలు, సన్నివేశాలు, సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్‌కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్‌కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది. దర్శకుడు వెంకీ కుడుముల. ఈ  ఏడాది ఫిబ్రవరిలో చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Click Here for Teaser

నటీనటులు :

నితిన్, రష్మిక మందన్న,నరేష్, సంపత్, రఘుబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, వెన్నెల కిషోర్, అనంత నాగ్, శుభలేఖ సుధాకర్, జస్సెన్ గుప్త, సత్యన్, మైమ్ గోపి, సత్య, కల్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, ప్రవీణ తదితరులు నటిస్తున్నారు.

మ్యూజిక్: మహతి స్వర సాగర్, డి.ఓ.పి: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: పి.డి.వి. ప్రసాద్, ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశీ, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వెంకీ కుడుముల.

Nithiin Bheeshma Teaser Released:

Bheeshma Movie Teaser Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ