మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో నిన్న శనివారం రాగా.. ఈ రోజు ఆదివారం బన్నీ అల వైకుంఠపురములో అంటూ దిగిపోయాడు. ఈ సినిమాలు మొదలైనప్పటి నుండి... విడుదలయ్యే వరకు ఒకదానితో ఒకటి పోటీ ఎలా పడ్డాయో.. ఇప్పుడు విడుదయాలయ్యాక మొదటి రోజు కలెక్షన్స్ విషయంలోనే కాదు... ఓవరీసీస్ కలెక్షన్స్ విషయంలోనూ, వీకెండ్ కలెక్షన్స్ విషయంలోనూ ఇంకా ఫైనల్ రన్ విషయంలోనూ భారీ పోటీ నడవడం గ్యారెంటీ. ఇప్పటికే ఓవర్సీస్ ప్రీమియర్స్ కలెక్షన్స్ విషయంలో సరిలేరు నీకెవ్వరుకి, అల వైకుంఠపురములో సినిమాకి మధ్యన పోలిక పెట్టి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు కూడా. మహేష్ సినిమా అల్లు అర్జున్ సినిమా రెండు ఓవర్సీస్ లో భారీగా విడుదలయ్యాయి. ఈ సినిమాలు ప్రీమియర్స్ కలెక్షన్స్ రిపోర్ట్ ఏమిటంటే.
ఓవర్సీస్ లో మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీమియర్స్ తో దడదడలాడిస్తే.. ఈరోజు విడుదలైన అల వైకుంఠపురములో అటు అమెరికా ఇటు న్యూజిలాండ్ లో రచ్చ రంబోలా అన్న రేంజ్ లో దూసుకుపోయింది. అమెరికాలో అల వైకుంఠపురములో ప్రీమియర్‌కి 590,216 డాలర్ల వసూళ్లు వచ్చినట్లు, అదే మహేష్ సరిలేరు నీకెవ్వరు అమెరికాలో తొలిరోజు కలెక్షన్లు 417,559 డాలర్లు వసూళ్లు వచ్చినట్టుగా తమిళ సినీ విశ్లేషకుడు రమేష్ బాల ట్విట్టర్ వేదికగా తెలియయజేసాడు. మరి ఆ రకంగా మహేష్ సరిలేరు కన్నా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఓ రేంజ్ లో దూసుకుపోయిందనే చెప్పాలి. అమెరికాలోనే కాదు... న్యూజిలాండ్ లోను అల వైకుంఠపురములో రచ్చ మాములుగా లేదని.. మూడు ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 34,625 డాలర్లు వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసిందని చెబుతున్నారు. మరి ఇప్పటికే అల వైకుంఠపురములో ఫస్ట్ హాఫ్ హిట్ అని.. సెకండ్ హాఫ్ యావరేజ్ అనే రిపోర్ట్ తో ఈ సినిమా హిట్ కొట్టేసిందని అల్లు అర్జున్ ఆర్మీ హర్షం వ్యక్తం చెయ్యడమే కాదు.. సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తుంది.