Advertisementt

‘అల వైకుంఠపురములో..’ హైలెట్ సీన్ ఇదే..!

Sun 12th Jan 2020 09:11 PM
allu arjun,trivikram srinivas,pooja hegde,ala vaikunthapurramuloo,movie,highlight scene  ‘అల వైకుంఠపురములో..’ హైలెట్ సీన్ ఇదే..!
Ala Vaikunthapurramuloo: This is the Highlight Scene ‘అల వైకుంఠపురములో..’ హైలెట్ సీన్ ఇదే..!
Advertisement
Ads by CJ

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు తెరకెక్కించిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’. శనివారం నాడు (జనవరి-12) విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. అయితే సినిమాకు హైలెట్స్ ఏంటి..? సినిమా ఏ సీన్‌తో ప్రారంభమవుతుంది..? సినిమాకు ఏయే సన్నివేశాలు హైలెట్‌గా నిలిచాయి..? అని అటు మెగాభిమానులు, బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొందరు మెగాభిమానులు సినిమా ఇప్పుడే చూడగా.. మరికొందరు నెక్స్ట్ షో కోసం వేచి చూస్తున్నారు.

వెన్నెల పండింది!

ఈ క్రమంలో సినిమా చూసొచ్చిన వీరాభిమానులు చెబుతున్న మాటలను బట్టి చూస్తే బొమ్మ అదిరిపోయిందని తెలుస్తోంది. టబు, రోహిణిలు డెలివరీ నిమిత్తం ఆస్పత్రిలో చేరే సీన్‌తో సినిమా ప్రారంభమవుతుంది. అయితే సినిమా ఆద్యంతం కామెడీ, ఎమోషన్స్‌తో సాఫీగా సాగిందని అభిమానులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మాటల మాంత్రికుడు అంటే కామెడీ, పంచ్‌లు, డైలాగ్స్ వర్షం కురుస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కామెడీ అనేది వెన్నెల కిషోర్ పండించేశారు. డాక్టర్‌ పాత్రలో వెన్నెల నటించగా.. సినిమాకు ప్లస్ పాయింట్ అని తెలుస్తోంది.

ఇదీ హైలెట్ సీన్..!!

ఇదిలా ఉంటే.. సౌత్‌లో డ్యాన్స్‌ ఇరగదీసే హీరోల్లో బన్నీ ఒకరన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అన్ని పాటలకు డ్యాన్స్ బన్నీ ఇరగదీశారు. ఇందులో భాగంగా.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు హీరోల పాటలకు స్టైలిష్‌స్టార్ తన స్టైల్‌తో దుమ్ము లేపేశాడని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈ సినిమా మొత్తమ్మీద ఇదే హైలెట్‌గా నిలిచిందని మెగాభిమానులు చెబుతున్నారు. 

మొత్తానికి చూస్తే.. బన్నీ-మాటల మాంత్రికుడు కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అదిరిపోయింది. మరోవైపు.. పూజా హెగ్డే ఖాతాలో మరో సూపర్ డూపర్ హిట్ పడిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి టాక్ అయితే ఓకే.. కలెక్షన్ల వర్షం ఏ మాత్రం కురుస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Ala Vaikunthapurramuloo: This is the Highlight Scene:

Positive talk to Ala Vaikunthapurramuloo Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ