Advertisementt

నాగబాబు వదిలేస్తే వారి పరిస్థితి ఏంటి?

Sun 12th Jan 2020 10:27 AM
nagababu,adirinidi,jabardasth,chammak chandra,rp,tv programs  నాగబాబు వదిలేస్తే వారి పరిస్థితి ఏంటి?
Nagababu Decision Changed on Adirindi Program నాగబాబు వదిలేస్తే వారి పరిస్థితి ఏంటి?
Advertisement
Ads by CJ

నాగబాబు జబర్దస్త్ నుండి వెళుతూ వెళుతూ.. హైపర్ ఆదిని, సుడిగాలి సుధీర్‌ని, చమ్మక్ చంద్రని, ఆర్పీని ఆఖరుకి యాంకర్ అనసూయని కూడా పక్క ఛానల్ కి పోదామని పిలిచాడు. అయితే ఆది, సుధీర్ లు మల్లెమాలతో ఉన్న అగ్రిమెంటు.. లేదంటే జబర్దస్త్ మీదున్న మమకారంతోనో .. నాగబాబు కూడా వెళ్లకుండా హ్యాండ్ ఇచ్చారు. ఆఖరుకి అనసూయ కూడా వెళ్ళలేదు. ఇక చమ్మక్ చంద్ర, ఆర్పీ లిద్దరూ నాగబాబుతో సహా అదిరింది ప్రోగ్రాంకి వెళ్లిపోయారు. అయితే చంద్ర పారితోషకాన్ని టెంప్ట్ అయ్యి జబర్దస్త్ ని వదిలేసాడనే టాక్ నడుస్తుంది. కానీ చంద్ర మాత్రం నాగబాబు గారు రమ్మంటేనే జబర్దస్త్ నుండి వచ్చామని, నితిన్, భరత్ ల వల్లే జబర్దస్త్ నుండి బయటికి రావాల్సి వచ్చింది అని చెబుతున్నాడు.

మరి చంద్ర అలా నాగబాబుని నమ్ముకుని జబర్దస్త్‌ని వీడాడు. తాజాగా అదిరింది ప్రోగ్రాం కి వస్తున్న రేటింగ్ తో అసంతృప్తిగా ఉన్న నాగబాబుకు మల్లెమాల వారు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పాత జబర్దస్త్ స్కిట్స్ తో అంటే నాగబాబు జడ్జ్ గా చేసిన హిట్ స్కిట్స్ తో నాగబాబు అదిరింది షో ని గడగడలాడిస్తున్నారు. అయితే అదిరింది షో కి రేటింగ్ రాకపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ నాగబాబు అదిరింది షో కే కాదు.. కొన్నాళ్ల పాటు టివి షోస్ కి దూరం కావాలని అనుకుంటున్నట్లుగా టాక్. 

అయితే నాగబాబు వెళ్ళిపోతే చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీలాంటోళ్ళు అన్యాయం అవడం గ్యారెంటీ. ఎందుకంటే చంద్ర, ఆర్పీలు నాగబాబు, నితిన్, భరత్ వల్లే జబర్దస్త్ షోని కాలదన్నారు. మరి అదిరింది నుండి వెళ్ళితే జబర్దస్త్ లో మళ్ళీ చోటు దొరుకుతుందో.. లేదో.. అనే మీమాంసలో ఉన్నారని టాక్. 

Nagababu Decision Changed on Adirindi Program:

Nagababu says goodbye to Adirindi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ