Advertisementt

‘సరిలేరు నీకెవ్వరు’: ఫైనల్ రిపోర్ట్ ఇదే!

Sun 12th Jan 2020 08:37 AM
sarileru neekevvaru,mahesh babu,final report,super star mahesh babu,sarileru neekevvaru final report  ‘సరిలేరు నీకెవ్వరు’: ఫైనల్ రిపోర్ట్ ఇదే!
Sarileru Neekevvaru Talk at Box Office ‘సరిలేరు నీకెవ్వరు’: ఫైనల్ రిపోర్ట్ ఇదే!
Advertisement
Ads by CJ

 

మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ అంచనాలు నడుమ భారీగా విడుదలైన మహేష్ సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ షో కే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఏపీ లో అర్ధరాత్రి నుండే సరిలేరు ప్రీమియర్ షోస్ పడితే.. తెలంగాణలోమాత్రం ఉదయం 7 గంటలకు ఫస్ట్ షో పడింది. మరి సరిలేరు నీకెవ్వరు సినిమా పక్కా మాస్ ఎంటెర్టైనెర్ అని.. అనిల్ రావిపూడి మహేష్ అభిమానులు మెచ్చేలా సినిమా తీసాడని ఫస్ట్ షో చూసిన ప్రేక్షకులు చెబుతున్న మాట. ఇక సినిమాలో రొటీన్ కథ అయినా స్క్రీన్‌ప్లేతో చాలావరకు మాయ చేసాడు అనిల్ రావిపూడి.. ఇంటర్వెల్ వరకు ఎలాగోలా కామెడీతో బండి లాగించిన అనిల్ రావిపూడి.. సెకండాఫ్ లో అసలు కథపై ఫోకస్ చేశాడు.. ఫస్ట్ హాఫ్ అంత కాశ్మీర్ ఎపిసోడ్ తో పాటు.. ట్రైన్ ఎపిసోడ్ తో పర్లేదనిపించాడు. కాకపోతే అనిల్ రావిపూడి గత సినిమాలతో పోలిస్తే మాత్రం ఇందులో కామెడీ కాస్త తక్కువగా ఉంది. ఇక అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి సెకండాఫ్ పై అంచనాలు పెంచేశాడు.

సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజ్ ఇంటికి మహేష్ బాబు వచ్చే సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి. ప్రీ క్లైమాక్స్ లో మహేష్, విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. కాకపోతే సెకండ్ హాఫ్ సాగదీత సన్నివేశాల వలన బోర్ కొట్టిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ లో కామెడీ మీద ఫోకస్ పెట్టకుండా అంతా యాక్షన్ మీదే నడిపించిన ఫీలింగ్ వస్తుంది. ఇక మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపించింది. విజయశాంతి పాత్ర హుందాగా ఉంది. కాకపోతే రష్మిక నే దర్శకుడు సరిగా వాడుకోలేదు. కొన్ని సన్నివేశాల్లో రష్మిక ఓవరేక్షన్ తట్టుకోలేం. కొన్ని చోట్ల క్యూట్ గా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మహేష్ అభిమనులకు ఎలా కావాలో అలానే మాస్ ఎంటరైనర్‌గా ఉంది. అయితే అనిల్ మాత్రం కామెడీ ట్రాక్ తప్పించి మహేష్ అభిమానుల కోసం రొటీన్ యాక్షన్ ట్రాక్ ఎక్కాడనిపించక మానదు. 

Sarileru Neekevvaru Talk at Box Office:

This is the Final Report fo Sarileru Neekevvaru Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ