టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు పూజా హెగ్దే. జూనియర్, సీనియర్, సూపర్‌స్టార్ ఇలా వరుస ఆఫర్లు కొట్టేసిన ఈ భామ టాలీవుడ్‌ను ఏలేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సీనియర్‌తో సినిమా అయినా.. జూనియర్ అయినా.. మొదట పూజానే సంప్రదించే పరిస్థితి వచ్చిందంటే ఈ ముద్దుగుమ్మ రేంజ్ ఏంటో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అలా గ్యాప్ లేకుండా సినిమాల్లో నటించేస్తోంది. ఒక్క టాలీవుడే కాదు.. బాలీవుడ్‌లోనూ ఇరగదీస్తోంది. తాజాగా ‘అల వైకుంఠపురములో’ నటించిన ఈ భామ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమాలోనూ నటిస్తోంది. ఇప్పటికే షూట్స్ కూడా మొదలయ్యాయ్.
ఇక అసలు విషయానికొస్తే.. వరుస సినిమాలు వస్తుండటం.. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు.. మంచి మంచి పాత్రలు వస్తుండటంతో ఈ బ్యూటీ కీలక నిర్ణయం తీసుకుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భావించిన ఈమె.. గట్టిగానే రెమ్యునరేషన్ పెంచేసిందట. ఇదిగో ఫలానా రౌండ్ ఫిగర్ అయితే తాను నటిస్తానని.. లేకుంటే అస్సలు వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా దర్శకనిర్మాతలను గట్టిగానే డిమాండ్ చేస్తోందట. అయితే ప్రస్తుతానికి పూజా టైమ్ నడుస్తోందిగా.. ఇక చేసేదేమీ లేక.. వేరొకర్ని వెతుక్కోలేక ఆమె అడిగినంతనే ఇవ్వడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారట.
తాజాగా.. అడివి శేష్ నటిస్తున్న ‘మేజర్’ మూవీలో నటించాలని నిర్మాతలు సంప్రదించారట. ‘ఎస్.. నేను రెడీ’ అని చెప్పేసిన ఈ భామ.. పనిలో పనిగా ఒకేసారి రెమ్యురేషన్ విషయం కూడా మాట్లాడేసిందట. అయితే ఆమె ఒకటి అర కాదు.. ఏకంగా ఒకేసారి రెండున్నర కోట్లు చెప్పిందట. ఆమె నోటి నుంచి ఈ మాట వినగానే ప్రొడ్యూపర్స్ కంగుతిన్నారట. అడిగిందట. సారీ.. మేడమ్ అని చెప్పి ఒకట్రెండు గంటల తర్వాత మిమ్మల్ని వద్దనుకున్నాం అని చెప్పి నిర్మాతలు షాకిచ్చారట. ఆమె స్థానంలో మరొకర్ని తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారట. కాగా ఇప్పటి వరకూ కోటిన్నర వరకూ పూజా పుచ్చుకునేదట. అయితే.. రెండు కోట్లు అయినా సరే ఇవ్వడానికి ‘మేజర్’ నిర్మాతలు పూనుకున్నప్పటికీ పూజా నో చెప్పడంతో షాకిచ్చి వేరొకరి కోసం వెతుకులాట మొదలెట్టారట.