ఇలా అనుకుంటున్నది ఎవరో కాదు... దర్శకుడు పూరి జ్ఙానంద్. దర్శకుడిగా, నిర్మాతగా పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ తో ఫైటర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఛార్మి - పూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్ లో కరణ్ జోహార్ అండ కూడా ఉంది. అయితే ఫైటర్ కి ముందు అనుకున్న బడ్జెట్ కేవలం 15 కోట్లు అంట. అయితే ఇప్పడు ఫైటర్ సినిమా బాలీవుడ్ నుండి తెలుగు వరకు తెరకెక్కడంతో.. ఫైటర్ బడ్జెట్ లెక్కలన్నీ మరిపోయాయి. ఫైటర్ 15 కోట్ల బడ్జెట్ కాస్తా... ఇప్పుడు దానికి త్రిబుల్ అయ్యే ఛాన్స్ కాదు... అందుకు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫైటర్ పాన్ ఇండియా ఫిలిం కాబట్టి.
అయితేఇప్పడు పూరి జగన్నాధ్ విజయ్ క్రేజ్ ముందు బడ్జెట్ ఎంత అన్నట్టుగా భారీ బడ్జెట్ పెట్టడానికి రెడీ అవుతున్నాడట. మరి సినిమా బడ్జెట్ కన్నా ఇప్పుడు పూరి హీరోయిన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటూ భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అయితే.. ఆమెకి కోట్లలో పారితోషకం. ఇక సౌత్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఓకె కానీ.. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అక్కడ భారీగా ఇచ్చుకోవాలి. క్రేజ్ కావాలంటే బడ్జెట్ పెట్టాలి. సో సినిమా బడ్జెట్ ఎక్కువే. ఇలా నటులు, టెక్నీషియన్స్ పారితోషకంతో ఫైటర్ కూడా భారీ బడ్జెట్ సినిమాగా మారబోతుందన్నమాట. మరి బాలీవుడ్ విజయ్ దేవరకొండ కున్న క్రేజ్, టాలీవుడ్, తమిళ్ లో ఉన్న క్రేజ్ తో పోలిస్తే ఈ బడ్జెట్ ఓ లెక్కా అన్నట్టుగా ఉంది ఇప్పుడు పూరి వ్యవహారం.