చిరంజీవి-కొరటాల కాంబో మూవీ ఈ నెలాఖరు నుండి పట్టాలెక్కబోతుంది. కొరటాల శివ పక్కా స్క్రిప్ట్‌తో చిరు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక చిరు కొరటాల శివ కోసం ఒళ్ళు తగ్గించి ఫిట్‌గా ఉండాలని ప్రిపేర్ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా చేస్తోందనే టాక్ ఉంది. అయితే ఈ సినిమాలో ‘రంగస్థలం’ లో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయకి ఓ కీ రోల్‌ని కొరటాల సిద్ధం చెయ్యడం దానికి చిరు ఓకే చెప్పడంతో.. అనసూయ, కొరటాల-చిరు సినిమాలో ఫిక్స్ అన్నారు. అయితే తాజాగా చిరంజీవి, అనసూయకి షాకిచ్చి ఆమె పాత్రకి మరొక హీరోయిన్‌ని తీసుకోబోతున్నాడనే టాక్ నడుస్తుంది.
‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో భారతిగా రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి ఈ మధ్యన ‘సరిలేరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరుని కలవడం పెద్ద సెన్సేషన్ అయ్యింది. చిరు-విజయశాంతి కలిసి దాదాపుగా 20 సినిమాలు చెయ్యడం.. సరిలేరు ఈవెంట్‌లో చిరు ఆప్యాయంగా విజయశాంతితో మాట్లాడం.. అలాగే సరిలేరు ఈవెంట్‌లో మహేష్ కన్నా ఎక్కువగా చిరు-విజయశాంతిల కలయిక హైలెట్ అవడంతో.. చిరు ఎలాగైనా తన నెక్స్ట్ సినిమాలో విజయశాంతికి ఓ రోల్ ఇవ్వాలని.. అది అనసూయ చెయ్యబోయే పాత్రనే కొద్దిగా నిడివి పెంచి అనసూయని తప్పించి విజయశాంతితో ఆ రోల్ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఇక చిరు ఆలోచనకు కొరటాల కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెప్పడం.. దానితో అనసూయకి అలా చిరు షాకిచ్చాడంటూ సోషల్ మీడియాలో న్యూస్‌లు కూడా హల్‌చల్ చేస్తున్నాయి.