Advertisementt

‘సరిలేరు..’ ముందు ‘అల’ క్రేజ్ తక్కువైందా?

Fri 10th Jan 2020 03:07 PM
ala vaikunthapurramuloo craze,sarileru neekevvaru,mahesh babu,allu arjun  ‘సరిలేరు..’ ముందు ‘అల’ క్రేజ్ తక్కువైందా?
ALA Craze Decrease Before Sarileru Neekevvaru! ‘సరిలేరు..’ ముందు ‘అల’ క్రేజ్ తక్కువైందా?
Advertisement
Ads by CJ

‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు నువ్వా నేనా అన్నట్టుగా సంక్రాతి బరిలోకి దిగుతున్నాయి. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’-‘అల వైకుంఠపురములో’ సినిమాల విషయంలో క్రేజ్ మాత్రం ఒకేలా కనబడుతుంది. అల్లు అర్జున్ - మహేష్‌ల సినిమాలపై ఫాన్స్ కూడా పోటాపోటీగా ఉన్నారు. ఇక మొదటి నుంచి అన్ని విషయాల్లో పోటీపడుతున్న ఈ రెండు సినిమాల జోరు బుక్ మై షో దగ్గర బయటపడింది. ‘సరిలేరు నీకెవ్వరూ’- ‘అల వైకుంఠపురములో’ సినిమాల ఆన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల బుకింగ్స్‌లో మహేష్ ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమా టికెట్స్ మాత్రం.. ఇలా పెడుతుంటే అలా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

అందులో మహేష్ సినిమా పక్కా మాస్, కామెడీ ఎంటర్టైనర్‌లా కనిపిస్తుండటం, అల్లు అర్జున్ కన్నా ఒకరోజు ముందుగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదల కావడంతో.. ఈ సినిమా టికెట్స్ మాత్రం బుక్‌మై షో లో దొరకడం లేదు. మల్టిప్లెక్స్ కన్నా ఎక్కువగా సింగిల్ స్క్రీన్స్‌లో ‘సరిలేరు’ జోరు కనబడుతుంది. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా టికెట్స్ బాగానే తెలుగుతున్నప్పటికీ.. ‘సరిలేరు నీకెవ్వరు’ ఆన్‌లైన్ బుకింగ్ మాత్రం జోరుగా సాగుతుంది. మహేష్ సరిలేరు టాక్ యావరేజ్ పడిందా.. అల వైకుంఠపురములో జోరు మాములుగా ఉండదు.. అసలే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో.. సంక్రాతి సీజన్‌లో ఫామిలీస్ పక్కాగా ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్‌ని కోరుకుంటారు కాబట్టి.. ‘అల’ దూకుడు అప్పుడు మొదలవ్వొచ్చు.

ALA Craze Decrease Before Sarileru Neekevvaru!:

ALA Craze Decrease Before Sarileru Neekevvaru!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ