Advertisementt

‘కలర్ ఫోటో’ పూజా కార్యక్రమాలతో ప్రారంభం!

Thu 09th Jan 2020 01:13 PM
color photo,tollywood movie,actor suhas  ‘కలర్ ఫోటో’ పూజా కార్యక్రమాలతో ప్రారంభం!
Color photo Movie formally launched ‘కలర్ ఫోటో’ పూజా కార్యక్రమాలతో ప్రారంభం!
Advertisement
Ads by CJ

‘హృదయ కాలేయం’, ‘కొబ్బరి మట్ట’ లాంటి స్పూఫ్‌తో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం కలర్ ఫోటో. ఈ సినిమాలో కమెడియన్ సుహాస్ హీరో పరిచయం కాబోతున్నాడు. మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తెలుగమ్మాయి  చాందిని చౌదరీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. కేర్ ఆఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా, ఏజెంట్ ఆత్రేయ సాయి శ్రీనివాస్ చిత్ర దర్శకుడు స్వరూప్ క్లాప్ కొట్టారు. స్క్రిప్ ను సునీల్ అందించిన ఈ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, గోపి మోహన్, పవన్ సాదినేని, నిర్మాత రాహుల్ యాదవ్ పాల్గొన్నారు.

యూట్యూబ్‌లో పాపులర్ అయ్యిన సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్న కీరవాణి అబ్బాయి కాల భైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. కామెడీ ఎంటర్త్సైనర్ గా రాబోతున్న ఈ చిత్రం 1995 లో ఒక ఇంజనీరింగ్ కాలేజి లో జరిగే ప్రేమకథగా రూపొందుతుంది. 

చిత్రం: కలర్ ఫోటో

బ్యానర్: అమృత ప్రొడక్షన్

సమర్పణ: శ్రవణ్ కొంక

లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్

నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్ తదితరులు

నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని

కథ: సాయి రాజేష్ నీలం

ఆర్ట్: క్రాంతి ప్రియం

కెమెరామెన్: వెంకట్ ఆర్ శాఖమురి

ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్

ఫైట్స్: ఎ.విజయ్

పిఆర్ఒ: ఏలూరు శ్రీను

Color photo Movie formally launched:

Color photo Movie  formally launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ