‘పటాస్’ చిత్రంతో దర్శకుడిగా పరిచమయ్యి తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గాఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. గతేడాది సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్-2’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో తెలుగులో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ ’సరిలేరు నీకెవ్వరు’. చిత్రానికి దర్శకత్వం వహించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ..
- గతేడాది సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్-2’ తో బ్లాక్ బస్టర్ సాధించి ‘సరిలేరు మీకెవ్వరు’ అనిపించుకున్నారు. మళ్ళీ ఈ సంక్రాంతికి సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా భారీ కాస్టింగ్ తో వస్తున్నారు. ఈ సంక్రాంతి ఎలా ఉంటుంది?
ఈ సంక్రాంతి గతేడాది కంటే ఎక్కువ నవ్వుకుంటారు. అదే విధంగా దేశభక్తి, ఎమోషన్స్, వాల్యూస్, అందరూ కోరుకునే ఫన్ ఇలా అన్ని మేళవించి సంక్రాంతి పిండి వంటలతో భోజనం ఎలా ఉంటుందో అంత కమ్మగా ఉండబోతుంది.
- పటాస్ నుండి ‘ఎఫ్-2’ వరకూ మీ జర్నీ ఎలా ఉంది. ఈ సినిమాతో ఎలా ఉంది?
‘పటాస్’ నుండి ‘ఎఫ్-2’ వరకూ ప్రతి సినిమాకి ఎంతోకొంత నేర్చుకుంటూనే వచ్చాను. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఒక పెద్ద స్కెల్ మీద ఇంత పెద్ద కాస్టింగ్, పెద్ద బడ్జెట్ తో చేస్తున్నాను. అందులోనూ మహేష్ గారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేశాను. ఆయన నన్ను నమ్మి ఈ సినిమా నాకు ఇవ్వడం నా అదృష్టం. ‘ఎఫ్-2’జరుగుతున్నప్పుడే ఈ కథ మహేష్ గారికి చెప్పాను. కథ విని ఎలా నమ్మారో సినిమా స్టార్టింగ్ నుండి చివరి వరకూ అదే నమ్మకంతో వర్క్ చేశారు. ఈ సినిమా మహేష్ గారు నా మీద పెట్టిన నమ్మకానికి ఈ సంక్రాంతికి నేను ఇచ్చేగిఫ్ట్.
- పెద్ద కాస్టింగ్ ఉన్నాకూడా షూటింగ్ ఇంత త్వరగా ఎలా పూర్తి చేయగలిగారు?
నేను ప్రతి కథ బౌండెడ్ స్క్రిప్ట్ తోనే వెళ్తాను. అలా వెళ్ళినప్పుడు మనవైపు నుండి ఎలాంటి ఆలస్యం జరగదు. ఇక ప్రొడక్షన్ నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఏది అడిగితే అనిల్ సుంకర గారు అది ఇచ్చారు. సినిమాలో చాలా సెట్స్ ఉన్నాయి అయితే మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు కరెక్ట్ టైమ్ కి వాటిని అందివ్వడం వల్లనే ఇంత తొందరగా సినిమా చేయగలిగాము. అయిదు నెలలలోనే షూటింగ్ పూర్తి చేయగలిగాము అంటే మా టీమ్ ఎఫర్ట్ కారణం.
- ముందుగా కాశ్మీర్ లోనే షూటింగ్ చేయడానికి రీజన్ ఏంటి?
ఈ సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్ అనుకున్నాం కాబట్టి మొదటి 25 నిమిషాలు చాలా కీలకం. విజువల్ గా స్టాండర్డ్ గా ఉండాలని కాశ్మీర్ లో రియలిస్టిక్ లొకేషన్స్ లో షూటింగ్ చేద్దాం అనుకుని ముందుగా అక్కడే షూటింగ్ చేశాం.
- ఈ కథ విని సూపర్‌స్టార్ మహేష్ ఏమైనా సజెషన్స్ ఇచ్చారా?
లేదండీ! మహేష్ గారికి మొదట నేను35 నిమిషాల పాయింట్ చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. ఈ కథలో ఎదో మ్యాజిక్ ఉంది. అలాగే ఆయన క్యారెక్టరైజేషన్ టైమింగ్ ఆయనకు బాగా నచ్చాయి. తర్వాత మూడు నెలల్లో బౌండెడ్ స్క్రిప్ట్ తో వెళ్లి ఫుల్ నరేషన్ ఇచ్చాను. ఫస్ట్ డైలాగ్ నుండి ఎండింగ్ వరకూ ప్రతి డైలాగ్ ఆయనకు గుర్తుంది.
- ఈ కథకు మూలం ఏంటి?
‘సుప్రీమ్’ సినిమా కోసం జోధ్ పూర్ నుండి హైదరాబాద్‌కి ట్రైన్ లో వస్తున్నప్పుడు ఒక సోల్జర్ ని కలిశాను. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చాలా జోవియల్ గా అనిపించారు. ఆర్మీ వారికి ఎప్పుడూ సరదాగా ఉండాలో, ఎప్పుడు సీరియస్‌గా ఉండాలో కరెక్ట్‌గా తెలుసు అని అర్ధమైంది. అలా ఇన్స్పైర్ అయ్యి ఆ ఎలిమెంట్స్ తీసుకొని ఈ కథ రాసుకున్నాను.
- సైనికులు, పోలీస్ అధికారి పాత్రలలో ఒక హీరోయిజాన్ని ఓన్ చేసుకుంటారు ప్రేక్షకులు. అది ఈ కథ రాస్తున్నప్పుడు మీకు ఎంత వరకూ ఉపయోగపడింది?
అది చాలా హెల్ప్ అయింది. పోలీస్, సోల్జర్ అనగానే ఒక హీరో అనే ఇమేజ్ పోట్రెట్ అవుతుంది. ఈ సినిమాలో ఆర్మీ గురించి చెప్పే ప్రతి మాట మన మనసులోతుల్లోకి వెళ్ళిపోతుంది. ప్రతి వ్యక్తిలో దేశభక్తి ఇన్ బిల్ట్ అయ్యి ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు నిజమే కదా సైనికులు మనకోసం ప్రాణాలు ఇస్తున్నారు కదా, కనీసం మనం ఇక్కడ భాద్యతగా ఉండాలి కదా అనే రెస్పాన్సిబిలిటీని అందరూ ఫీల్ అవుతారు.
- ఒకే సినిమాలో దేశభక్తిని, ఎంటరైన్మెంట్ ని జోడించడం ఛాలెంజింగ్ గా అనిపించిందా?
ఒక యుద్ధ వాతావరణం నుండి సాధారణ ప్రజల మధ్యకు వచ్చిన సైనికుడికి అందరూ చాలా అమాయకంగా కనిపిస్తారు. ఎందుకంటే సరిహద్దులో శత్రువులు వేరు, సమాజంలో శత్రువులు వేరు. వీళ్ళ కోసం కదా మనం ప్రాణాలు ఇస్తుంది. వీరందరూ భాద్యతగా ఉండాలి కదా అనేది హీరో క్యారెక్టరైజషన్. రేపు మీరు స్క్రీన్ మీద చూస్తే ఆ క్యారెక్టర్ ఎక్కడా లైన్ దాటి వెళ్లి కామెడి చేసినట్టు ఉండదు. అలాగే ఎక్కువ సీరియస్ గా కూడా ఉండదు. ఆ క్యారెక్టర్ ని అంత పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశారు మహేష్ బాబు గారు.
- సూపర్‌స్టార్ మహేష్ తో వర్క్ ఎక్స్‌పీరియన్స్?
మహేష్ గారిలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే వెంటనే మనకు ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. ఒక సోదరుడిలా ట్రీట్ చేస్తారు. చాలా సరదాగా మాట్లాడుతుంటారు. అందరి మీద జోక్స్ వేస్తుంటారు. దాంతో ఒక సూపర్ స్టార్ తో పనిచేస్తున్నాను అనే ఫీలింగ్ కలగదు. అలాగే మానిటర్ దగ్గర ఉన్న డైరెక్టర్ ని గమనిస్తూ దర్శకునికి కావలసిన అవుట్ ఫుట్ వచ్చే వరకు చేస్తారు
- ఈ సినిమాతో మీకు మహేష్ బాబు ప్లస్ అవుతారా? లేక మీరు మహేష్ కి ప్లస్ అవుతారా?
హండ్రెడ్ పర్సెంట్ నాకే మహేష్ బాబు గారు ప్లస్ అవుతారు. ఎందుకంటే మహేష్ గారు చేయని పాత్రలు కాదు, ఆయన చూడని బ్లాక్ బస్టర్స్ కాదు. కానీ మహేష్ బాబు గారితో ఈ సినిమా నా కెరీర్ కి ప్లస్ అవుతుంది.
- చాలా కాలం తర్వాత విజయశాంతి నటిస్తున్నారు కదా! ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
13 ఏళ్ల తరువాత విజయ శాంతి గారు ఈ సినిమా చేశారు. అయితే ఇందుకోసం విజయశాంతి గారు ఈ క్యారెక్టర్ చేశారా..అనే విధంగా ఆమె క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమాకు వన్ ఆఫ్ ది హైలెట్ విజయ శాంతి గారు. ఎందుకంటే గతంలోనే ఒక పాత్ర కోసం ఆమెని కలిశాను. మంచి క్యారెక్టర్ రాస్తే ఆమె చేస్తారు అనే పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. ఆమె కోసమే ఆ పాత్ర రాశాను.
- మైండ్ బ్లాక్ సాంగ్‌లో మహేష్ డాన్స్ బాగా చేశాడని చెప్పారు?
అవును ! డాన్స్ చాలా బాగా చేశారు. బేసిక్ గా మహేష్ మంచి డ్యాన్సర్, డాన్సులు చేసే సిచ్యువేషన్స్ లేక కొన్ని సినిమాల్లో చేసి ఉండరు. మైండ్ బ్లాక్ సాంగ్ కి శేఖర్ మాస్టర్ బ్రహాండంగా కొరియోగ్రఫీ చేశారు. షూటింగ్ పూర్తయ్యాక సాంగ్స్ షూట్ చేశాం కాబట్టి ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ కొద్ది మహేష్ గారు డాన్సులు అదరగొట్టారు. ఈ సంక్రాంతి మహేశ్ గారి ఫ్యాన్స్‌కి పెద్ద పండగే..
- నిర్మాత అనిల్ సుంకరతో మీ ట్రావెల్ ఎలా ఉంది?
చాలా బాగుంది. దిల్‌రాజు గారితో నేను మూడు సినిమాలు చేశాను. అది నా స్వంత బేనర్‌లా ఫీల్ అవుతాను. అనిల్ సుంకర ప్రొడక్షన్ లో చేయడం మొదటి సారి. అనిల్ గారు వెరీ కూల్ పర్సన్. సినిమాకి ఏం కావాలో అన్ని సమకూర్చారు. ఈ బేనర్‌లో చాలా కంఫర్ట్‌గా ఉంది. పైగా ఈ సినిమాకి దిల్‌రాజు సమర్పకులు.
ఈ సినిమా మహేశ్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకునే చేశారా?
- మహేశ్ బాబు నుండి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉంటూ..అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే పర్పస్‌ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సంక్రాంతికి అభిమానులకి, ప్రేక్షకులకి పండుగ లాంటి సినిమా. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా `సరిలేరు నీకెవ్వరు`.
- మీ కామెడీ కి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా?
జంధ్యాల గారు. నాకు ఇష్టమైన దర్శకులు, ఆయన సినిమాలో ఎక్కడ చూసిన ఒక హెల్తీ కామెడీ ఉంటుంది. మేనరిజం తో కామెడీ పుట్టించడం పరిశ్రమకు నేర్పింది ఆయనే. నేను ఆయనకి ఒక రకంగా ఏకలవ్య శిష్యుడిని.
- ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి మీ గురించి చాలా బాగా మాట్లాడారు కదా! ఆయనతో సినిమా చేసే ఆలోచన ఉందా?
నిజంగా అలాంటి అవకాశమే వస్తే ఎగిరిగంతేస్తాను. నేను ఎదురుచూస్తున్నాను. ఆయన ఊ అనాలే కానీ మూడు నెలల్లో కథ రెడీ చేస్తాను.
- ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు అని చెప్పారు కదా..
అది సర్ప్రైజ్. మీరు స్ర్కీన్ మీద చూసి థ్రిల్ అవ్వాల్సిందే..
- ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మహేష్ నా 25 సినిమాలలో ఏ సినిమా షూటింగ్ లోనూ ఇంత ఎంజాయ్ చేయలేదు అని ఓపెన్ గా చెప్పారు..
బేసిక్ గా నేను వెరీ పాజిటివ్ పర్సన్ ని. నన్ను ఎవరైనా ఏమైనా అన్నా కూల్‌గానే ఏందీ బాసు అలా అన్నావ్ అని అడుగుతాను. నాకు కోపం వస్తే ఏదైనా తింటుంటాను. షూటింగ్‌లో నేను ఏదైనాతింటున్నాను అంటే కోపంగా ఉన్నానని అర్దం. నేను తినడం మీద కూడా మహేశ్ గారు జోక్స్ వేసేవారు. ఈ సినిమా డబ్బింగ్ కూడా మహేష్ బాబు గారి ఇంట్లో హోమ్ ధియేటర్‌లోనే చెప్పాం. ఈవినింగ్ టిఫిన్ టైమ్ అయ్యే సరికి డబ్బింగ్ ఆపి మరి రండి టిఫిన్ చేద్దాం అని పిలిచేవారు. నన్ను అంతబాగా చూసుకున్నారు. ఈ సినిమాలో ఏన్నో మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్‌లు ఉన్నాయి.
- టెక్నిషియన్స్ గురించి చెప్పండి?
దేవిశ్రీ ప్రసాద్ మోస్ట్ పాజిటివ్ పర్సన్. ముఖ్యంగా కథకు ఏం కావాలో అది ఇస్తాడు. ఈ సినిమాకైతే దర్శకుడిగా నేను పూర్తి హ్యాపీ గా ఉన్నాను. నాలుగు పాటలు ఎక్స్ట్రాడినరీ గా నచ్చాయి. రేపు థియేటర్స్ లో పాటలకి ఎవరూ సీట్లో కూర్చోరు. ఈ సినిమాతో మళ్ళీ మునపటి దేవిశ్రీ ని చూస్తారు. అలాగే రత్నవేలు గారు డైరెక్టర్స్ కెమెరామెన్. సీన్ చెప్పి ఇలా తిరిగే లోపే రెడీ అంటారు అంత ఫాస్ట్ ఆయన. అలాగే ఈ సినిమాలో నాలుగు ఫైట్స్ ఉన్నాయి. రామ్ లక్ష్మణ్ గారు అద్భుతంగా డిజైన్ చేశారు. ఎడిటర్ తమ్మిరాజు గారు ఫస్ట్ జడ్జ్. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ సెట్స్ గురించి రేపు అందరూ మాట్లాడుకుంటారు.
- ఈ సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి?
ఈ సినిమాతో పాటు జనవరి 9న రజిని కాంత్ ‘దర్బార్’ జనవరి 12న బన్నీ త్రివిక్రమ్ ‘అలవైకుంఠపురములో’.. ‘జనవరి 15’ న నాకు మొదటి సినిమా ఇచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ విడుదలవుతున్నాయి. ఈ సంక్రాంతి పండుగకి విడుదలయ్యే అన్ని సినిమాలు బాగా ఆడాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.. ’ అంటూ సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్య్వూ ముగించారు.