Advertisementt

‘ఉత్తర’ కు మంచి ఆఫర్స్

Wed 08th Jan 2020 11:06 PM
good offers,tollywood,uttara,tirupati sr  ‘ఉత్తర’ కు మంచి ఆఫర్స్
Good Offers For Uttara!! ‘ఉత్తర’ కు మంచి ఆఫర్స్
Advertisement
Ads by CJ

శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్ ఆర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉత్తర’. జనవరి 3 న విడుదలై మంచి సినిమాగా గుర్తింపు తెచ్చకున్న ఈ సినిమా రిలీజ్ టైంలో థియేటర్స్ దొరకక ఇబ్బంది పడింది. అయితే సినిమాకి వచ్చిన రెస్సాన్స్ అండ్ మౌత్ టాక్ కారణంగా విడుదలైన అన్ని థియేటర్స్‌లో మంచి టాక్‌ని సొంత చేసుకొని ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.  

ఈ  సందర్భంగా దర్శకుడు తిరుపతి యస్ ఆర్ మాట్లాడుతూ.. ‘ సినిమా పబ్లిసిటీ, రిలీజ్ విషయంలో కొందరి వ్యక్తులను నమ్మి మోసపోయాను. అందుకే ఉత్తర అనుకున్న థియేటర్స్ లో విడుదల చేయలేకపోయాం. కానీ ఉత్తరకు వస్తున్న రెస్సాన్స్ తో థియేటర్స్ దగ్గర వినపడుతున్న టాక్‌తో ఉత్తర సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యింది. మేము పెట్టిన డబ్బులు రాబట్టకోగలిగాం..  పూర్తి తెలంగాణా నేటివిటీ లో రూపొందిన ఈ సినిమాకు తమిళ, కన్నడ నుంచి రిమేక్ అండ్ డబ్బింగ్ ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే డిజిటల్, శాటిలైట్ మార్కెట్ లో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో మా టీం కాస్త ఊపిరి పీల్చుకోగలిగింది. ఉత్తర ను సరిగ్గా ప్రేక్షకులు దగ్గరకు తీసుకెళ్ళ లేకపోవడంలో కొందరి వ్యక్తుల మోసం ఉంది. ఇన్ని ఆటంకాలు వచ్చినా ఉత్తర ప్రేక్షకులు మనస్సులను గెలుచుకుంది. అది మాకు ఆనందంగా ఉంది’ అన్నారు.

నటీ నటలు: శ్రీరామ్ నిమ్మల, కారుణ్య కత్రేన్, అజయ్ ఘోష్, వేణు, అభినవ్, అభయ్ తదితరులు 

సమర్పణ: రవికుమార్ మాదారపు

బ్యానర్స్: లైవ్ ఇన్ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్స్

సినిమాటోగ్రఫీ: చరణ్ బాబు

మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి

ఎడిటర్: బొంతుల నాగేశ్వర రెడ్డి

రైటర్: ఎన్. శివ కల్యాణ్

రచన మరియు దర్శకత్వం : తిరుపతి యస్ ఆర్

ప్రొడ్యూసర్స్ : తిరుపతి యస్ ఆర్. శ్రీపతి గంగదాస్

Good Offers For Uttara!!:

Good Offers For Uttara!!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ