ఒకట్రెండు సుమారు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత అలనాటి స్టార్ హీరోయిన్.. లేడీ అమితాబ్‌గా పేరుగాంచిన విజయశాంతి అలియాస్ రాములమ్మ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కమ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తి చేసుకున్న చిత్రం.. ఈ నెల 11న థియేటర్లలోకి వచ్చేస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూడటంతో.. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మహేశ్ బాబు ఫ్యాన్స్ వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. సూపర్‌స్టార్ సినిమా కావడంతో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సైతం వెయిటింగ్‌లో ఉన్నారు. మరోవైపు ఈ సినిమాలో రాములమ్మ కీలక పాత్ర పోషించిందని వార్తలు రావడంతో ఆమె పాత్రేంటి..? రీ ఎంట్రీ తర్వాత పరిస్థితి ఎలా ఉంది..? నాటికి నేటికి ఆమె నటనలో తేడా వచ్చిందా లేదా..? ఇలా పలు ప్రశ్నలు వస్తున్నాయి.
ఇవన్నీ అటుంచితే.. తాజాగా మరో సంచలన, ఆశ్చర్యపోయే వార్త వెలుగుచూసింది. ‘సరిలేరు నీకెవ్వరు’లో రాములమ్మ రెమ్యునరేషన్ ఎంత పుచ్చుకున్నారనేదే ఆ వార్త సారాంశం. వాస్తవానికి అప్పుడెప్పుడో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భావించినప్పటికీ కథ, పాత్ర, రెమ్యునరేషన్ విషయంలో తేడా కొట్టడంతో మిన్నకుండిపోయిన రాములమ్మను ‘సరిలేరు’లో నటించి తీరాల్సిందేనని పట్టుబట్టి మరీ అనిల్‌ను ఆమెకు మంచి పాత్ర ఇచ్చాడు. అయితే సినిమాలో పాత్ర ఇచ్చి రీ ఎంట్రీ ఇప్పించారు సరే రెమ్యునరేషన్ ఎంత ఇప్పించారనేది ఇప్పుడు టాలీవుడ్‌లో.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
పారితోషికం విషయమై టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు, విజయశాంతికి సన్నిహితంగా ఉండేవాళ్లను అడిగి తెలుసుకోగా.. ఆమె రూ. 2 కోట్లు అడిగినప్పటికీ.. దర్శకనిర్మాతలు మాత్రం అంతపుచ్చుకోలేమని ఒకట్రెండు సార్లు చెప్పి ఫైనల్‌గా రూ. 1.5 కోట్ల రూపాయిలు ఇచ్చుకున్నారట. వాస్తవానికి విజయశాంతి తప్ప ఆ పాత్రలో మరొకరు చేస్తే సెట్ అవ్వదని భావించి చేసేదేమీ లేక దర్శకనిర్మాతలు కోటిన్నర ఇచ్చుకున్నారట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది. అయితే.. ఈ రెమ్యునరేషన్ విషయం అక్షరాలా నిజమైనా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. అప్పట్లోనే రాములమ్మ.. హీరోలకు సమానంగా పారితోషికం పుచ్చుకున్నారు.. మరి ఇప్పుడు అంత డిమాండ్ చేయడంలో కూడా పెద్ద తప్పేమీ లేదని సినీ విశ్లేషకులు, క్రిటిక్స్ చెబుతున్నారు.