టైటిల్ చూడగానే.. అవును నిజమా..? అని కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ.. ఎస్ మీరు వింటున్నది నిజమే. అంతేకాదండోయ్.. ఇన్ని రోజులూ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సినిమాల్లో చిరు గెస్ట్ రోల్‌లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం మెగాస్టార్ చిరు సినిమాలో చెర్రీ గెస్ట్ రోల్‌తో వచ్చేస్తున్నాడు. ఇంతకీ అసలు కథేంటి..? ఏ సినిమాలో చెర్రీ నటిస్తున్నాడు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చిరు-కొరటాల కాంబోలో సినిమా షూటింగ్ మాత్రం గ్రాండ్‌గానే ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ రెగ్యులర్‌గా షూటింగ్ మాత్రం కాలేదు కానీ.. సినిమాకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే.. చిరు పాత్రపై, సినిమా టైటిల్, హీరోయిన్ విషయమై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయ్. అయితే తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఆసక్తికర అనడం కంటే మెగాభిమానులు, సినీ ప్రియులకు పండుగలాంటి వార్తేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.
చిరు-కొరటాల కాంబోలో వస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా నటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్లాష్ బ్యాక్‌లో అనగా.. చిరు చిన్నప్పుడు ఉండే పాత్రలో చెర్రీ కనిపించి అలరిస్తాడట. ఇద్దరూ ఒకే స్టేజ్‌పైన కనిపిస్తేనే మెగాభిమానులకు పండుగ.. అదే ఇద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తే ఇక మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవేమో.!. ప్రస్తుతం ఇంకా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగలేదు.. దీంతో మొదట చిరుకు సంబంధించిన సన్నివేశాలు పూర్తవ్వగానే..చెర్రీ రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. ప్రస్తుతం RRR షూటింగ్‌లో బిజిబిజీగా ఉండటంతో.. చిరు సన్నివేశాలు అవ్వగానే చెర్రీ షూటింగ్‌కు వస్తాడట. ఇదిలా ఉంటే.. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొరటాలతో.. వంద రోజుల్లోనే సినిమా పూర్తి చేయాలని చిరు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.