Advertisementt

సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ టీజర్ విడుదల

Wed 08th Jan 2020 08:19 PM
suriya,aakasam nee haddhu ra,teaser  సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ టీజర్ విడుదల
Suriya’s Aakasam Nee Haddhu Ra Teaser Released సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ టీజర్ విడుదల
Advertisement
Ads by CJ

తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి పాపులారిటీ, మార్కెట్ వాల్యూ సంపాదించుకున్న స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘గురు’ వంటి హిట్ మూవీని రూపొందించిన సుధ కొంగర ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్, సిఖ్య ఎంటర్‌టైన్మెంట్ పతాకాలపై సూర్య, రాజశేఖర్ కర్పూరసుందర పాండ్యన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సుర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ రోజు (మంగళవారం) ‘ఆకాశం నీ హద్దురా’ టీజర్ విడుదలైంది. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ మొదలవడం విశేషం. ఈ టీజర్ ప్రకారం సొంతంగా ఒక ఎయిర్‌లైన్స్ కంపెనీ పెట్టాలని కలలుకనే ఒక మిడిల్ క్లాస్ యువకుడిగా సూర్య కనిపిస్తున్నారు. ఆఖరుకు టాటా వాళ్లకు కూడా సాధ్యం కాని కల కంటున్నావంటూ ప్రతి ఒక్కరూ అతడిని అవమానిస్తుంటారు. ఒక యథార్థ కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా.. అనేక అవరోధాల్ని ఎదుర్కొని తను అనుకున్నది సాధించే ఒక సాధారణ వ్యక్తి కథను తెలియజేస్తుంది.

గ్రిప్పింగ్ స్టోరీలైన్‌తో ఈ సినిమా తయారవుతోందని టీజర్‌ని బట్టి అర్థమవుతోంది. మధ్యతరగతి యువకునిగా సూర్య నటన ఈ సినిమాకు హైలైట్ అవుతుందనేది స్పష్టం. జెహోవాసన్ అల్ఘర్ స్వరపరిచిన బీజీయం ఉత్కంఠను కలిగిస్తోంది. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రంలో డాక్టర్ ఎం. మోహన్‌బాబు, పరేష్ రావల్, అపర్ణా బాలమురళి, ప్రకాష్ బెలవాది, ఊర్వశి, కరుణాస్, వివేక్ కీలక పాత్రధారులు. చెన్నై, హైదరాబాద్, చత్తిస్‌గడ్, మదురై వంటి లొకేషన్స్‌లో 60 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. 2020 వేసవికి ఈ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

సాంకేతిక వర్గం:

స్క్రీన్‌ప్లే: షాలిని ఉషాదేవి, సుధ కొంగర

అడిషనల్ స్క్రీన్‌ప్లే: ఆలిఫ్ సుర్తి, గణేశా

డైలాగ్స్: రాకేందు మౌళి

మహా థీం లిరిసిస్ట్: ప్రణవ్ చాగంటి

సంగీతం: జి.వి. ప్రకాశ్‌కుమార్

బ్యాగ్రౌండ్ స్కోర్ సూపర్‌విజన్, ఎడిటింగ్: జెహోవాసన్ అల్ఘర్

సినిమాటొగ్రఫీ: నికేత్ బొమ్మి

ఆర్ట్: జాకి

ఎడిటింగ్: సతీష్ సూర్య

కొరియోగ్రఫీ: శోబి, శేఖర్ వి.జె.

ఫైట్స్: గ్రెగ్ పోవెల్, విక్కీ

పీఆర్వో: వంశీ-శేఖర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అచిన్ జైన్, పవిత్ర

సహ నిర్మాతలు: రాజశేఖర్ కర్పూర సుందరపాండ్యన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సుర్తి

నిర్మాత: సూర్య

బ్యానర్స్: 2డి ఎంటర్‌టైన్‌మెంట్, సిఖ్య ఎంటర్‌టైన్‌మెంట్

కథ, దర్శకత్వం: సుధ కొంగర

Suriya’s Aakasam Nee Haddhu Ra Teaser Released:

Suriya’s Aakasam Nee Haddhu Ra Teaser Released  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ